సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది అంటే ఆ సినిమా పట్ల దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఇక స్టార్ హీరోలైన యువ హీరోలు ఆయన తమ సినిమాలో ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి హీరోయిన్స్ కనుక నటిస్తే సినిమాకి మంచి మైలేజ్ వస్తుందని భావిస్తారు.
అందుకే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి వారికి కాల్ షీట్స్ తీసుకోవడం కోసం కొంతమంది దర్శక నిర్మాతలు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఇలా ప్రతి ఒక్కరు కూడా స్టార్ హీరోయిన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

తాజాగా ఇలాంటి ఎదురుచూపులు నాగార్జున కూడా చూస్తున్నారని తెలుస్తోంది.నాగార్జున( Nagarjuna ) తన తదుపరి సినిమా కోసం ఇండస్ట్రీలో ఎంతో మంచి స్టార్ సక్సెస్ అందుకున్నటువంటి హీరోయిన్ కనుక తీసుకుంటే తన సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని భావించారట ఈ క్రమంలోనే తన సినిమాలో నటించడం కోసం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి రష్మిక( Rashmika ) కు ఫోన్ చేసి మరి తన కాల్ షీట్స్ కావాలని అడిగారట.ఇలా నాగార్జున వ్యక్తిగతంగా రష్మికకు ఫోన్ చేసి తన సినిమాలో నటించడానికి ఆమె కాల్ షీట్స్ అడిగినప్పటికీ రష్మిక మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

నాగార్జున నాని కాంబినేషన్లో వచ్చినటువంటి దేవదాసు( Devadas ) సినిమాలో నానికి జోడిగా రష్మిక నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమాల్లో నటించడం వల్ల రష్మికతో ఉన్న పరిచయం కారణంగా ఈయన రష్మికకు ఫోన్ చేసినప్పటికీ ఆమె మాత్రం తనకు ఏ మాత్రం డేట్స్ ఖాళీగా లేవు సర్ ఒకవేళ ఉంటే మరో ఏదైనా సినిమాలో తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సినిమా అవకాశాన్ని తిరస్కరించారట.ఇలా నాగార్జున వంటి ఒక స్టార్ హీరో స్వయంగా ఫోన్ చేసి మరి తన సినిమాలో అవకాశం కల్పించినప్పటికీ రష్మిక రిజెక్ట్ చేయడంతో నాగార్జున అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి నాగార్జున ఈ సినిమా కంటే ముందుగానే రష్మికను మరో సినిమాలో కూడా నటించాలని కోరారట అప్పుడు కూడా ఈమె ఇలాగే రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.నాగార్జున నాగచైతన్య( Nagachaitanya ) కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బంగార్రాజు ( Bangarraju ).సినిమా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి( Kriti Shetty ) నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈమె స్థానంలో ముందుగా రష్మిక మందననే అనుకొని అప్పుడు కూడా ఈమెను సంప్రదించగా రష్మిక ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశారట నాగార్జున రష్మికను తన సినిమాలలో తీసుకోవాలి అని భావించినప్పటికీ ఆమె మాత్రం డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







