Reheating Food: వీటిని మళ్లీ వేడి చేసి తినడం ఆరోగ్యానికి అంత హానికరమా..

మన దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు రాత్రిపూట మిగిలిపోయిన ఆహారాన్ని ఉదయం వేడి చేసుకుని లేదా ఏదైనా చిత్రాన్నం చేసుకుని తింటూ ఉంటారు.కానీ ఇలా కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడి చేసుకుని తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 Is Reheating And Eating These Foods Harmful To Health Details, Reheating Foods,-TeluguStop.com

ముఖ్యంగా చలికాలంలో చాలామంది అన్ని రకాల వంటకాలను వేడి చేసి తింటూ ఉంటారు.దీనికంటే ఏ పూట ఆహారం ఆ పుటే వండుకొని తినడం మంచిది.

కానీ వండిన ఆహారాన్ని పదేపదే వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు.నిజానికి ఇలా వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు అన్ని తగ్గిపోతాయి.

అంతేకాకుండా ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.దీనివల్ల ఆహారం విషపూరితంగా మారిపోతుంది.ఇంకా చెప్పాలంటే మరికొంతమంది మైక్రోవేవ్లో ఆహారాన్ని వేడి చేస్తుంటారు.ఇలా చేయడం అస్సలు మంచిది కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా చేసి తింటే కడుపులో గ్యాస్, ఫుడ్ పాయిజన్ లాంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇంతకీ ఎలాంటి ఆహారాలను అస్సలు వేడి చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమ్లెట్ లేదా గుడ్డు కూరలు చల్లగా అయితే వీటిని చాలామంది ఒకటి రెండు నిమిషాలు ఓవెన్ లో వేడి చేసి తింటూ ఉంటారు.

Telugu Chicken, Egg Omlet, Poison, Foods, Tips, Oven, Potato Curry, Unhealthy-Te

ఇలా చేయడం వల్ల గుడ్లను వండిన తర్వాత మళ్లీ వేడి చేయడం చాలా ప్రమాదకరం.ఇలా వేడి చేస్తే సాల్మొనెల్ల వంటి బ్యాక్టీరియా వాటిపై పెరిగే అవకాశం ఉంది.దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే బంగాళాదుంప కూరను కూడా వేడి చేసి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట.చాలామంది రాత్రి మిగిలిపోయిన చికెన్ పొద్దున వేడి చేసి తింటూ ఉంటారు.

కానీ ఇలా మిగిలిపోయిన చికెన్ తినడానికి బదులుగా పారేయడమే మంచిది.అన్నాన్ని కూడా పదేపదే వేడి చేసి తినడం అస్సలు మంచిది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube