అక్కినేని బ్యాక్ గ్రౌండ్ ఉన్న.. సుమంత్ హీరోగా సక్సెస్ కాలేక పోవడానికి కారణాలు ఇవే?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారే ఎక్కువమంది ఉన్నారు.అయితే స్టార్ బ్యాక్ గ్రౌండ్ వుంటే చాలు ఇక సినిమాల్లో హీరోగా సెట్ అవ్వడం ఖాయం అని అందరూ భావిస్తూ ఉంటారు.

 Why Sumanth Not Able Get Stardom , Sumanth, Sumanth Akkineni, Raghavendra Rao,-TeluguStop.com

కానీ కొంతమంది హీరోలు మాత్రం భారీ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోగా నిలదొక్కుకోలేక చిత్ర పరిశ్రమలో కనుమరుగై పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.అలాంటి వారిలో అక్కినేని కుటుంబం బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కూడా ఒకరు.

అయితే సుమంత్.ఒకప్పుడు మంచి హీరోగా గుర్తింపు సంపాదించినప్పటికీ అదే పాపులారిటీ కొనసాగించ లేక సక్సెస్ అందుకోలేక పోవడానికి పలు కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి సినిమానే లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు.రెండవ మూవీ యువకుడు అట్టర్ ఫ్లాప్ సొంతం చేసుకుంది.ఇక మూడవ సినిమా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సంబంధం కి హిట్ దక్కలేదు.ఇక ఆ తర్వాత నాగార్జున తో చేసిన స్నేహమంటే ఇదేరా రామా చిలకమ్మ కూడా పూర్తిగా ఫ్లాపయ్యాయి.

కానీ ఆ తర్వాత వచ్చిన సత్యం సినిమా మాత్రం మంచి సక్సెస్ తెచ్చిపెట్టింది.అటు వెంటనే గౌరీ, గోదావరి మూవీ లు కూడా మంచి ఇమేజ్ని తెచ్చిపెట్టాయి.

తర్వాత 2011 వరకు ఎలాంటి హిట్ కొట్టలేదు ఇక మళ్లీ రావా సినిమాతో మరోసారి ఆవరేజ్ హిట్ అందుకున్నాడు.

అయితే అక్కినేని సుమంత్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా కాస్త డిఫరెంట్ జోనర్ సినిమాలు కావడం గమనార్హం.

ప్రయోగాత్మక సినిమాలు చేయడం వల్లనే అక్కినేని బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా ఎదగలేకపోయారు అన్న టాక్ కూడా ఉంది.సాధారణంగా స్టార్ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి సినిమానే హిట్టు పడుతుంది.

కానీ సుమంత్ కు మాత్రం దాదాపు మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్ తర్వాత హిట్టు.ఇక అక్కినేని లాంటి భారీ బ్యాగ్రౌండ్ వచ్చినప్పటికీ మాస్ పల్స్ లేని సినిమాలను ఎంచుకోవడం కూడా సుమంత్ సక్సెస్ కావడానికి కారణం అని చెప్పాలి.

Telugu Gauri, Godavari, Sumanth, Raghavendra Rao, Tollywood, Sumanth Stardom-Tel

అంతేకాకుండా నువ్వే కావాలి మనసంతా నువ్వే తొలిప్రేమ ఇడియట్ లాంటి సినిమాలను వదులుకొని కెరీర్లో పెద్ద తప్పు చేశాడు సుమంత్.ఒకవేళ ఈ సినిమాలు చేసి ఉంటే మాత్రం స్టార్ హీరో అయ్యేవాడు.ఇక అంతే కాదు మధ్యలో చాలా గ్యాప్ ఇవ్వడం తో ఫ్యాన్ బేస్ అలాగే మెయింటెయిన్ చెయ్యలేకపోయాడు.అయితే సుమంత్ కు మాస్ ఫాలోయింగ్ రాకపోవడం కూడా హీరోగా సక్సెస్ కాకపోవడానికి కారణం అని తెలుస్తుంది.

ప్రయోగాత్మక సినిమాలు తప్ప కమర్షియల్ సినిమాల జోలికి పోలేదు.దీంతో అక్కినేని బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చి మహేష్ పవన్ సరసన ఉండాల్సిన సుమంత్ ఆవరేజ్ హీరోగా కూడా గుర్తింపు సంపాదించుకోలేక పోయారు అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube