తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ సినిమాలను చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) లాంటి హీరోలు మాత్రం చాలా మంచి సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు.ప్రస్తుతం ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.
నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కొడుకుగా వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకున్న మొదటి హీరో కూడా తనే కావడం విశేషం.ఇక ఆయన తర్వాత అల్లు అర్జున్( Allu Arjun ) కూడా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కొడుకుగా వచ్చి స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

అయితే వీళ్ళిద్దరూ కూడా ప్రొడ్యూసర్స్ కొడుకులే అయినప్పటికి చాలా వరకు కష్టపడి మరి వాళ్ళకంటూ ఒక గుర్తింపును సంపాదించి తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు.వాల కెరియర్ మొదట్లో ఈ హీరోలతో సినిమాలు చేస్తే సక్సెస్ అవుతాయా లేదా అని అనిపించుకున్న వాళ్ళు సైతం ఈ హీరోలతోనే సినిమాలు చేయాలని అనుకొనే వాళ్ళతో జై కొట్టించుకున్న స్టార్లు కూడా వీళ్లే కావడం విశేషం…ఇక రీసెంట్ టైమ్ లో వాళ్ళిద్దరు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఈ ఇద్దరూ హీరోలను పరిచయం చేసింది కూడా రాఘవేంద్రరావు( Raghavendra Rao ) గారే కావడం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళుతున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నాడు.అలాగే వెంకటేష్ సైతం తన ఇమేజ్ కు సరిపోయే సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.మరి ఈ ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో చాలా వరకు కృషి చేస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.