ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా ప్రతి ఒక్కరూ అన్నం వండుకోవడానికి కుక్కర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఎందుకంటే కుక్కర్లో ఎలాంటివి వండినా కూడా తొందరగా ఉడుకుతాయనే భావనతో ప్రతి వంటకాన్ని కుక్కర్లోనే చాలామంది చేస్తున్నారు.
అయితే ప్రెజర్ కుక్కర్లో కొన్ని పదార్థాలను చేయడం వలన దాని రుచి తగ్గిపోతుంది.అయితే ప్రెజర్ కుక్కర్లో ( Pressure Cooke )వండకూడని పదార్థాలను ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది ప్రెజర్ కుక్కర్ లో ఏ వంట కానీ వండినా కూడా త్వరగా అయిపోతుంది.సమయాన్ని ఆదా చేయవచ్చు అన్న ఆలోచనతో ప్రతి ఒక్క వంటకాన్ని అందులో చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా అన్నం చేయడానికి ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగిస్తూ ఉంటారు.అయితే అన్నం ప్రెజర్ కుక్కర్ లో ఉడికించడం వలన బియ్యంలో ఉన్న పిండి పదార్థం అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయాన్ని విడుదల చేస్తుంది.దీని వలన కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే వీలైనంతవరకు అన్నం కుక్కర్లో వండకుండా ఉండడం మంచిది.ఇక ప్రెజర్ కుక్కర్లో బంగాళదుంపలు కూడా ఉడికించకూడదు.ఎందుకంటే బంగాళదుంపలలో కూడా ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి.
అందుకే బంగాళాదుంపలను ప్రెజర్ కుక్కర్ లో ఉడికించడం మంచిది కాదు.

ఇక ప్రెజర్ కుక్కర్లో పాస్తా( Pasta ) కూడా అసలు వండకూడదు.పాస్తాలో అధిక స్ట్రాచ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.ఇది హానికరమైన రసాయాలను విడుదల చేస్తుంది.
అందుకే పాస్తా ప్రెజర్ కుక్కర్లో వండడం మంచిది కాదు.దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఇక ప్రెజర్ కుక్కర్లో పాల ఉత్పత్తులను కూడా ఉడికించకూడదు.ప్రెజర్ కుక్కర్లో పాలు లేదా జున్ను లాంటి పాల ఉత్పత్తులను వండడం వలన అవి పగిలిపోయి వండిన వంటను పాడు చేస్తాయి.
అలాగే అలాంటి ఆహారం తీసుకోవడం వలన అనేక సమస్యలు కూడా వస్తాయి.ఇక ప్రెజర్ కుక్కర్ లో చేపలు వండడం కూడా అస్సలు మంచిది కాదు.
చేప( Fsh )ను ప్రెజర్ కుక్కర్లో వండడం వలన అందులో ఉండే ఫైబర్ కంటెంట్ పూర్తిగా నశించిపోతుంది.అలాంటి ఆహారాన్ని తినడం వలన అనేక సమస్యలలో పడాల్సి వస్తుంది.