నేటి స్మార్ట్ కాలంలో వ్యాపారం( Business ) విజయవంతంగా నిర్వహించాలంటే కేవలం నాణ్యమైన ఉత్పత్తులు సరిపోవు.వ్యాపారంలో మంచిగా మాట్లాడడం, కస్టమర్ ను గౌరవించడం, మంచి సంబంధాలు అత్యంత కీలకం.
కస్టమర్లను దేవుళ్ళుగా చూసి, వారికి ఉత్తమమైన ఉత్పత్తులను అందించాలి.అలా కాకుండా వారి ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తే వ్యాపార భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది.
ఇలాంటి అంశాన్ని అర్థం చేసుకోవడానికి తాజాగా అలేఖ్య చిట్టి( Alekhya Chitti ) వివాదం ఉదాహరణగా మారింది.

అలేఖ్య చిట్టి అనే అమ్మాయి రాజమండ్రికి( Rajahmundry ) చెందిన ఒక యువతి.తన పచ్చళ్ళ వ్యాపారాన్ని( Pickles Business ) ఎంతో వేగంగా ఎదిగేలా చేసుకుంది.మార్కెట్లో తన ఉత్పత్తులను తానే ప్రమోట్ చేసుకుని, తన వాక్చాతుర్యంతో మంచి పేరు తెచ్చుకుంది.
అయితే, ఇటీవల ఆమె కస్టమర్లతో ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది.అలేఖ్య చిట్టి తన పచ్చళ్ళ వ్యాపారాన్ని వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా నిర్వహిస్తుంది.కస్టమర్లు ఆర్డర్ చేస్తే, వాటిని వారి గమ్యస్థానాలకు డెలివరీ చేస్తుంది.కానీ, ఇటీవల ఒక కస్టమర్ ఆమె ఉత్పత్తుల ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నించాడు.
దీనికి అలేఖ్య చిట్టి నుంచి వచ్చిన స్పందన అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆ కస్టమర్ సాధారణంగా ధరల గురించి విచారణ చేయగా, అతనికి అవతలి వైపు నుంచి అత్యంత దురుసుగా, బూతులతో నిండిన వాయిస్ మెసేజ్ వచ్చింది.దీనికి సంబంధించి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ ఆడియో విన్న కేవలం ఉత్పత్తి ధర గురించి అడిగినందుకు అలా ప్రవర్తించడం సరైనదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ వాయిస్ మెసేజ్ వైరల్ కావడంతో అలేఖ్య చిట్టిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.వ్యాపారంలో కస్టమర్లను గౌరవించడం అత్యంత ముఖ్యమని, అలేఖ్య తన మాటల ద్వారా తన బ్రాండ్‌కు నష్టం తెచ్చుకుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
దీనికి తోడు, ఆమెపై నెగటివ్ పబ్లిసిటీ పెరగడంతో తాను నడుపుతున్న పికిల్స్ వ్యాపారం కొంతకాలం మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.నెటిజన్ల విమర్శల నేపథ్యంలో ఆమె తన వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌ను తొలగించింది.
అంతేకాకుండా ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రస్తుతం కనిపించకుండా పోయింది.