ఈ మధ్య కాలంలో గుండెజబ్బుల బారిన పడి చనిపోయే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఇతర కారణాల వల్ల ఎక్కువమంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
మన శరీరంలోని ప్రధానమైన అవయవాలలో గుండె ఒకటనే సంగతి తెలిసిందే.గుండె ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదు.
వయస్సు పెరిగే కొద్దీ గుండె జబ్బుల రిస్క్ అంతకంతకూ పెరుగుతుంది.
అయితే మనకు గుండె జబ్బుల ముప్పు ఉందో లేదో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హర్ట్ ఎటాక్ రిస్క్ ను ఒక టెస్ట్ ద్వారా కనిపెట్టవచ్చని తెలిపారు.కేవలం 90 సెకన్లు ఒక పని చేయడం ద్వారా మన గుండె ఆరోగ్యంగా ఉందో ఆరోగ్యంగా లేదో సులువుగా తెలుస్తుంది.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజిస్ట్ కు చెందిన శాస్త్రవేత్తలు మెట్లు ఎక్కడం ద్వారా గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చని వెల్లడిస్తున్నారు.
శాస్త్రవేత్తలు 165 మందిని 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించి ఆ తరువాత వేగంగా 60 మెట్లు ఎక్కాలని కోరారు.అలా మెట్లు ఎక్కిన వాళ్లను బట్టి వ్యాయామ సమయాన్ని కొలిచారు. 45 సెకన్ల లోపు 60 మెట్లు ఎక్కితే గుండె ముప్పు బారిన పడే అవకాశాలు తక్కువని అలా కాకుండా 60 మెట్లు ఎక్కడానికి 90 సెకన్ల కంటే ఎక్కువ సమయం పడితే గుండె డేంజర్ లో ఉందని భావించాలని వెల్లడిస్తున్నారు.
45 సంవత్సరాల వయస్సు దాటిన పురుషులకు గుండెపోటు ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గుండె ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవైనా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
కొంతమందిలో ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే గుండెపోటు వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.