అయ్యో పాపం, ఈ వధువుకి ఎంత కష్టమొచ్చింది.. ట్రైన్ ఫ్లోర్‌పై ఎలా కూర్చుందో!

తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్‌గా మారింది.ఆ ఫోటోలో అప్పుడే పెళ్లయిన ఒక వధువు( Bride ) రైలు కంపార్ట్‌మెంట్‌ ఫ్లోర్‌పై( Train Compartment Floor ) కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది.

 Photo Of Bride Sitting On Train Floor Goes Viral Details, Viral Photo, Bride In-TeluguStop.com

తన వెంట ఉన్న బ్యాగ్‌ను ఆధారంగా చేసుకుని ఫ్లోర్‌పైనే కూర్చుంది.ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరూ షాక్ అయ్యారు.

ఈ ఫోటో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కుల వర్ణ వ్యవస్థలోని అసమానతలు, మ్యారేజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ వంటి అంశాలపై చర్చకు తెరలేపింది.చాలామంది నెటిజన్లు ఈ వధువు పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ, రైల్వే శాఖ( Railway Department ) ఇలాంటి పరిస్థితులను ఎలా సహిస్తుంది అని ప్రశ్నిస్తున్నారు.

మరికొందరు మాత్రం సమాజంలోని ఆర్థిక అసమానతల వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.

“ఒక వధువు తన వివాహం రోజున ఇంత అవమానకరమైన పరిస్థితుల్లో ప్రయాణించాల్సి రావడం చాలా బాధాకరం” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.“రైల్వే శాఖ ఇలాంటి పరిస్థితులను అనుమతించడం దారుణం” అని మరొకరు అన్నారు.ఈ వైరల్ వధువు ఫోటోను( Viral Bride Photo ) ఒక ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ తన పేజీలో పోస్ట్ చేసి, చాలా వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు.

ఆయన తన ఫాలోవర్లను ఉద్దేశించి, “ఎవరైతే తమ కుమార్తెలను, తమను తాము, తమ భార్యలను బాగా చూసుకోలేరో మీ పిల్లని వారికిచ్చి పెండ్లి చేయవద్దు” అని సలహా ఇచ్చారు.

ఈ ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి.కొంతమంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నప్పటికీ, మరికొందరు మాత్రం ఆయనను తీవ్రంగా విమర్శిస్తున్నారు.చాలామంది నెటిజన్లు ఈ ఇన్‌ఫ్లూయెన్సర్ ఆ ఫోటోను తన ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు.

వారు ఆ ఫోటో నిజాయితీపై సందేహం వ్యక్తం చేస్తూ, ఆ వధువు పరిస్థితిని తన ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాడని విమర్శిస్తున్నారు.కొందరు “అయ్యో పాపం, ఈ వధువుకి ఎంత కష్టమొచ్చింది.

కొత్త పెళ్లి కూతురికి కనీసం ఒక సీట్ బుక్ చేయలేరా?” అని క్వశ్చన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube