వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్లడం అక్కడే స్థిరపడుతుండటంతో భారతీయ భాషలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతోంది.తాజాగా భారతదేశ రాజభాష అయిన హిందీ విషయంలో ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయం తీసుకునే అడుగులు వేస్తోంది.
ఐరాస వార్తలను, ఇతర అంశాలను కమ్యూనికేట్ చేయడానికి హిందీలో వాట్సాప్ ఛానెల్ ప్రారంభించాలని భావిస్తున్నారు.
శుక్రవారం జరిగిన హిందీ దివాస్ వేడుకలో ( Hindi Divas ) ఐరాస న్యూస్ అండ్ మీడియా డైరెక్టర్ ఇయాన్ ఫిలిప్స్ మాట్లాడుతూ.
హిందీ ప్రేక్షకులతో కమ్యూనికేట్ చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.కృత్రిమ మేథస్సు పుంజుకుంటున్న నేపథ్యంలో భారత్ పోషించాల్సిన పాత్ర ఎంతో ఉందని , తర్వాతి తరం నాయకులకు ప్రాతినిథ్యం వహించేలా మిలియన్ల మందితో కమ్యూనికేట్ చేయడానికి హిందీ కీలకమైన ఛానెల్‌గా ఉందని ఫిలిప్స్ అన్నారు.
ఈ వేడుకకు బీరేంద్ర ప్రసాద్ బైశ్యా( Birendra Prasad Baishya ) నేతృత్వంలోని భారత పార్లమెంట్ సభ్యుల బృందం, భారత్‌తో భాషాపరమైన సంబంధాలు పెంచుకోవాలని చూస్తున్న పలు దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి పి.హరీశ్ ( P.Harish )మాట్లాడుతూ.భారత్ వంటి బహుళ భాషా, సాంస్కృతిక, జాతులున్న దేశంలో విభిన్న వర్గాల మధ్య అంతరాన్ని హిందీ తగ్గిస్తుందని పేర్కొన్నారు.భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశాన్ని ఏకం చేయడంలో హిందీ అపూర్వమైన పాత్ర పోషించిందని హరీశ్ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, మాండరిన్ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషగా హిందీ ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ మిషన్.హిందీలో వ్యాస రచన, కవితలు తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసింది.ఈ సమావేశానికి గయానా డిప్యూటీ పర్మినెంట్ రిప్రజెంటేటివ్ త్రిశాల , నేపాల్ శాశ్వత ప్రతినిధి లోక్ బహదూర్ థాప, మారిషస్ శాశ్వత ప్రతినిధి జగదీష్ కుంజాల్ తదితరులు హాజరై హిందీ ప్రాముఖ్యతను వివరించారు.