పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan )అని ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే.అయితే మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ బిజీ బిజీగా గడిపిన పవన్ ప్రస్తుతం ఈ సినిమా పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్.
ఇకపోతే తాజాగా హీరో నాని( Nani ), పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచిన హీరోలలో నాని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.
![Telugu Nani, Pawan Kalyan, Tollywood-Movie Telugu Nani, Pawan Kalyan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/nani-comments-on-pawan-kalyan-about-politicsd.jpg)
అయితే తాజాగా పవన్ గురించి నాని మాట్లాడుతూ.సినిమాల్లో పవన్ కల్యాణ్ స్టార్‌గా ఎలా ఎదిగారో తెలిసిందే.అయితే రాజకీయాల్లోనూ( politics ) ఆయన అదే స్థాయిలో ఎదిగారు.అక్కడ కూడా పవర్‌స్టార్ అని నిరూపించుకున్నారు.ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు అని నాని తెలిపారు.ఈ కామెంట్స్ పై రానా ( Rana )స్పందిస్తూ.
పవన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారని అన్నారు.ఆయన నిజంగానే సూపర్ స్టార్ అని చెప్పారు.
రాజకీయాలు కూడా సినిమాల్లాగే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
![Telugu Nani, Pawan Kalyan, Tollywood-Movie Telugu Nani, Pawan Kalyan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/nani-comments-on-pawan-kalyan-about-politicsc.jpg)
ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే హీరో నాని విషయానికి వస్తే ఇటీవల నాని సరిపోదా శనివారం అనే శనివారం ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.
ప్రస్తుతం నాని తన తదుపరి సినిమాలలో బంగారు బిజీ బిజీగా ఉన్నారు.