టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో గత కొన్నేళ్లలో రెమ్యునరేషన్ల లెక్కలు పూర్తిస్థాయిలో మారిపోయాయి.స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
అయితే ఒక స్టార్ కమెడియన్ కు డైలీ కాల్షీట్ల వల్ల ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ దక్కినట్టు సమాచారం అందుతోంది.ఆ లక్కీ కమెడియన్ ఎవరో కాదు వైవా హర్ష అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సారంగపాణి జాతకం సినిమా ( Sarangapani Jatakam movie )త్వరలో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం వైవా హర్ష బల్క్ డేట్లు కేటాయించగా డైలీ కాల్షీట్స్ ప్రకారం రెమ్యునరేషన్ ఇవ్వాల్సి రావడంతో ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంది.
సారంగపాణి జాతకం సినిమాతో వైవా హర్ష ( Viva Harsha )జాతకం మాత్రం మారిపోయిందని తెలుస్తోంది.
![Telugu Bachlamalli, Priyadarshi, Tollywood, Viva Harsha, Vivaharsha-Movie Telugu Bachlamalli, Priyadarshi, Tollywood, Viva Harsha, Vivaharsha-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/viva-harsha-remuneration-for-sarangapani-jatakam-movie-details-inside-goes-viralb.jpg)
ప్రియదర్శి కెరీర్ ఈ సినిమాతో మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా సైతం సక్సెస్ సాధిస్తే ప్రియదర్శి హీరోగా మరిన్ని సినిమాలు తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.
![Telugu Bachlamalli, Priyadarshi, Tollywood, Viva Harsha, Vivaharsha-Movie Telugu Bachlamalli, Priyadarshi, Tollywood, Viva Harsha, Vivaharsha-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/viva-harsha-remuneration-for-sarangapani-jatakam-movie-details-inside-goes-viralc.jpg)
బచ్చలమల్లి సినిమాకు పోటీగా ఈ సినిమా విడుదలవుతోంది.పుష్ప2 విడుదలైన రెండు వారాలకు ఈ సినిమా విడుదలవుతూ ఉండటం గమనార్హం.ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సారంగపాణి జాతకం మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.
డిసెంబర్ నెల 25వ తేదీన రాబిన్ హుడ్ మూవీ విడుదల కానుంది.రాబిన్ హుడ్ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.ఈ ఏడాది డిసెంబర్ నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమని చెప్పవచ్చు.