ఆ మూవీకి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ కమెడియన్.. ఏమైందంటే?

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో గత కొన్నేళ్లలో రెమ్యునరేషన్ల లెక్కలు పూర్తిస్థాయిలో మారిపోయాయి.

స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.అయితే ఒక స్టార్ కమెడియన్ కు డైలీ కాల్షీట్ల వల్ల ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ దక్కినట్టు సమాచారం అందుతోంది.

ఆ లక్కీ కమెడియన్ ఎవరో కాదు వైవా హర్ష అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సారంగపాణి జాతకం సినిమా ( Sarangapani Jatakam Movie )త్వరలో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం వైవా హర్ష బల్క్ డేట్లు కేటాయించగా డైలీ కాల్షీట్స్ ప్రకారం రెమ్యునరేషన్ ఇవ్వాల్సి రావడంతో ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంది.

సారంగపాణి జాతకం సినిమాతో వైవా హర్ష ( Viva Harsha )జాతకం మాత్రం మారిపోయిందని తెలుస్తోంది.

"""/" / ప్రియదర్శి కెరీర్ ఈ సినిమాతో మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా సైతం సక్సెస్ సాధిస్తే ప్రియదర్శి హీరోగా మరిన్ని సినిమాలు తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.

"""/" / బచ్చలమల్లి సినిమాకు పోటీగా ఈ సినిమా విడుదలవుతోంది.పుష్ప2 విడుదలైన రెండు వారాలకు ఈ సినిమా విడుదలవుతూ ఉండటం గమనార్హం.

ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సారంగపాణి జాతకం మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

డిసెంబర్ నెల 25వ తేదీన రాబిన్ హుడ్ మూవీ విడుదల కానుంది.రాబిన్ హుడ్ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఈ ఏడాది డిసెంబర్ నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమని చెప్పవచ్చు.

సీఎం పదవినే వద్దనుకున్న సోనూసూద్.. ఈ హీరో నిజంగా గ్రేట్ అని అనాల్సిందే!