పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan )కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఏపీలో జనసేన పార్టీ గెలుపునకు పవన్ క్రేజ్ కారణమని చెప్పవచ్చు.అయితే పవన్ కళ్యాణ్ లెగ్ గోల్డెన్ లెగ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో పవన్ 5 చోట్ల ప్రచారం చేయగా పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించింది.
మహారాష్ట్రలోనూ( Maharashtra ) పవన్ కళ్యాణ్ హవా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం దాదాపుగా ఖరారైంది.పవన్ ఎన్డీయే తరపున మహారాష్ట్రలో పలు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది.
పుణె, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
పుణె, బల్లార్ పూర్, షోలాపూర్( Pune, Ballarpur, Sholapur ) ప్రాంతాలలో మహాయుతి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా డెత్లూర్, లాతూర్‌లలో( Dethlur, Latur ) కూడా ఒక నియోజకవర్గంలో ఎన్డీయే కూటమికి అనుకూల ఫలితం వచ్చే ఛాన్స్ అయితే ఉంది.మహారాష్ట్రలో 200కు పైగా నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంది.
మహాయుతి కూటమి ప్రకటించిన సంక్షేమ పథకాలు ఎన్నికల్లో గెలుపునకు కారణమయ్యాయి.ఉచిత పథకాల వల్ల ప్రజలకు భారీ స్థాయిలో లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది.పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో బీజేపీ తరపున మరికొన్ని ప్రాంతాలలో ప్రచారం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఓజీ సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలలో నటించే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం భారీ స్థాయిలో ఉంది.