గర్భధారణ( Pregnancy ) సమయంలో మహిళలు బాగా వీక్ అవుతారు.కొంచెం దూరం కూడా నడవలేరు.
ఏ చిన్న పని చేసినా నీరసించిపోతారు.దీంతో ప్రెగ్నెన్సీ సమయంలో మంచానికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది.
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.దీంతో గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే అనారోగ్య సమస్యలు గురించి చూద్దాం.

గర్భవతిగా ఉన్న సమయంలో శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.వీటి వల్ల మూడ్ స్వింగ్స్( Mood Swings ) వస్తాయి.దీని వల్ల మహిళల మూడ్ అనేది మారుతూ ఉంటుంది.
చిరాకుగా ఉండటం, కొన్నిసార్లు భయంగా ఉంటారు.భావోద్వేగాలు మారుతూ ఉండటం వల్ల ఏడుస్తారు.
ఇక గర్భిణీగా ఉన్నప్పుడు హ్యుమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది.దీని వల్ల మార్నింగ్ సిక్‌నెస్ ఉంటుంది.
అలాగే గర్భిణులకు పాదాలలో వాపు వస్తుంది.దీంతో పాటు మలబద్ధకం సమస్య కూడా వస్తుంది.

మలం గట్టిగా మారి త్వరగా బయటకు రాదు.దీని వల్ల ఫిషర్స్ వస్తాయి.అలాగే గర్భిణులకు హార్ట్ బర్న్, కటి వలయ లాంటి సమస్యలు కూడా వస్తాయి.హార్ట్ బర్న్ సమస్య( Heart Burn ) వచ్చినప్పుడు గుండెలో మంటగా ఉంటుంది.
స్టమక్ యాసిడ్ అన్నవాహిక, గొంతులోకి తిరిగి ప్రవహించినప్పుడు గుండెలో మంట ఏర్పడుతుంది.ఇలాంటప్పుడు హార్ట్ బర్న్ సమస్య వస్తుంది.
పడుకున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.ఇక పెల్విస్ పట్టుకోల్పోవడం వల్ల పెల్విక్ ప్రాంతంలో నొప్పి పుడుతుంది.
దీనిని కటి వలయ నొప్పి అని అంటారు.ఇలా ప్రెగ్నెన్సీ మహిళలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
వీటి నుంచి బయట పడాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి.
అలాగే డాక్టర్ల సలహాలు కూడా తీసుకుంటూ ఉండాలి.







