భారతదేశపు సాంకేతిక రాజధానిగా బెంగళూరు నగరం( Bengaluru ) నిలుస్తుందనే సంగతి తెలిసిందే.ఇక్కడ లక్షలాది మంది ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పర్ట్స్ తమ కెరీర్ లైఫ్ ప్రారంభిస్తారు.
అక్కడే వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు.ఈ నగరానికి వచ్చిన ఇంజనీర్లు( Engineer ) లైఫ్ లో మరింత సక్సెస్ అవుతారు కానీ ఒక ఇంజనీర్ లైఫ్ మాత్రం తలకిందులు అయింది.
ఒకప్పుడు గొప్ప ఇంజనీర్ అయిన వ్యక్తి ఇప్పుడు బెంగళూరు వీధుల్లో బిచ్చ మెత్తుకుంటూ( Begging ) బతుకుతున్నాడు.బెంగళూరు నగరం అతని జీవితాన్ని నాశనం చేయలేదు కానీ ఇతర ఇంజనీర్ల జీవితం ఒకలా, ఇతని జీవితం మరోలా ఉండటమే అందరినీ బాధిస్తోంది.
ఈ విషయాన్ని ఒక ప్రముఖ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తన ఫాలోవర్లతో పంచుకున్నారు.ఈ క్రియేటర్ బెంగళూరులోని ఒక వీధిలో నిలబడి ప్రార్థిస్తున్న వ్యక్తిని కలిశారు.
ఆ వ్యక్తి మురికి పట్టిన గులాబీ టీషర్టు, జీన్స్ ధరించాడు.మొదటి చూపులో ఆయన ఒక బిచ్చగాడు అని ఎవరైనా అనుకుంటారు.
కానీ ఆ క్రియేటర్ ఆయనతో మాట్లాడగానే ఆశ్చర్యపోయారు.ఎందుకంటే ఆ వ్యక్తి చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.
ఆ వ్యక్తి తన గత జీవితాన్ని గురించి చెప్పారు.తాను ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ ఇంజనీర్‌ని అని, బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ, జర్మనీలోని( Germany ) ఫ్రాంక్‌ఫర్ట్‌లోనూ పనిచేశానని చెప్పారు.కానీ తన తల్లిదండ్రులు అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన జీవితం పూర్తిగా మారిపోయిందని, ఆ విషాదం ఆయన్ని మద్యపానం వైపు నెట్టిందని చెప్పారు.ఆయన తన ఉద్యోగం, స్థిరమైన జీవితం మాత్రమే కాకుండా, జీవితం పట్ల ఉన్న హోప్ కూడా కోల్పోయారు.
అయితే అతని వీడియో విస్తృతంగా వైరల్ అయింది చాలా న్యూస్ ఛానల్ అతని గురించి రిపోర్ట్ చేస్తున్నాయి దీనివల్ల పోలీస్ కమిషనర్లు ఈ మాజీ ఇంజనీర్ కు కావలసిన సహాయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే అతని ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నట్లుగా సమాచారం.దొరికిన వెంటనే మంచి ఆహారం అందించి, అనారోగ్యాలకు చికిత్స అందించే అవకాశం ఉంది.చాలామంది అతనికి మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుతున్నారు.అదే జరగాలని ఆశిద్దాం.