బీట్ రూట్( Beetroot ).దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అద్భుతమైన దుంపల్లో బీట్ రూట్ ఒకటి అనడంలో సందేహమే లేదు.తియ్యటి రుచిని కలిగి ఉండే బీట్ రూట్ దుంపలు ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి.
అందుకే బీట్ రూట్ ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా బీట్ రూట్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా డిటాక్స్ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకుంటే మీరు ఊహించని లాభాలు మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా ఒక చిన్న బీట్ రూట్ తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో బీట్ రూట్ తురుమును వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, మూడు లెమన్ స్లైసెస్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఎనిమిది నుంచి పది ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint leaves ) వేసుకోవాలి.
చివరిగా రెండు గ్లాసుల వాటర్ పోసి బాగా మిక్స్ చేసి నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మన డిటాక్స్ డ్రింక్ సిద్ధం అయినట్టే.ఈ డ్రింక్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.రోజుకు ఒక గ్లాసు ఈ బీట్ రూట్ డిటాక్స్ డ్రింక్ ను తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
నీరసం అలసట దూరం అవుతాయి.రక్తహీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలిగిపోతాయి.బాడీ క్లీన్ గా మారుతుంది.సంతాన సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.లైంగిక శక్తి రెట్టింపు అవుతుంది.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.లివర్ ఆరోగ్యంగా మారుతుంది.
మరియు స్కిన్ టోన్ మెరుగు పడుతుంది.చర్మం నిత్యం కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా సైతం మెరుస్తుంది.