భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో భారతీయులు ఎక్కువగా రవాణా మార్గం రైలు మార్గం ప్రయాణాన్ని ఎంచుకుంటారు.ఇలా రైల్వే ప్రయాణం చేయాలన్నప్పుడు ముఖ్యంగా స్లీపర్ క్లాస్ లలో ప్రయాణం చేయాల్సిన సమయంలో అందుకు సంబంధించిన టికెట్లు పొందడం కూడా చాలా కష్టమే అయిపోయింది ఈ మధ్యకాలంలో.
ఇకపోతే అనేక రూల్స్ ను పాటించి మనం రైల్వే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.కేవలం ప్రజలకు మాత్రమే రూల్స్ కాదు.
రైల్వేలో సంబంధించి ఏదైనా సేవలు కూడా అనేక రూల్స్ ప్రకారమే జరగాలి.ఇకపోతే తాజాగా ఓ రైల్లో ధరకు మించి వాటర్ బాటిల్స్ ను( Water Bottles ) అమ్మిన ఘటనపై రైల్వే సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందుకు సంబంధించి క్యాటరింగ్ కంపెనీ( Catering Company ) ఏకంగా లక్ష రూపాయల ఫైన్ వేధించింది రైల్వే శాఖ.
ఈ సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు వెళితే.నవంబర్ 12న పూజ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్( Pooja Superfast Express ) జమ్మూ తావి నుండి అజ్మీర్ జంక్షన్ కు బయలుదేరగా మార్గమధ్యంలో ఏసీ బోగిలోకి క్యాటరింగ్ బాయ్ వాటర్ బాటిల్లను తీసుకోవచ్చాడు.అలా తీసుకువచ్చిన అతను వాటర్ బాటిల్ ను రూ.15 అమ్మాల్సి ఉండగా కస్టమర్ నుంచి 20 రూపాయలను వసూలు చేయడం ఓ ప్రయాణికుడు వీడియో తీసి దానిని రైల్వే శాఖకు కంప్లైంట్ చేశాడు.ఓ ప్రయాణికుడు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేయగా.
సదర్ క్యాటరింగ్ బాయ్ కచ్చితంగా 20 రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ అన్ని భోగిల్లో వాటర్ బాటిల్లను అదే ధరకు అమ్మడం జరిగింది.
దాంతో ఆ విషయాన్ని ప్రయాణికుడు సెల్ఫోన్లో రికార్డ్ చేసి రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 కు కాల్ చేసి విషయాన్ని చెప్పాడు.అయితే అలా ఫోన్ కట్ చేసి కొద్దిసేపు అయిందో లేదో అలా కేటరింగ్ సంస్థకు కాల్ వెళ్లి వెంటనే ప్రయాణికులకు నుండి అధికంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అధికారులు సదరు కేటరింగ్ కంపెనీకి ఆర్డర్ పాస్ చేశారు.దాంతో రైల్వే అధికారుల ఆదేశాలతో ఏ క్యాటరింగ్ అబ్బాయి ఎక్కువ ధరకు వాటర్ బాటిల్లు అమ్మాడో అదే వ్యక్తి ఎవరెవరు దగ్గర ఎక్కువ డబ్బులను తీసుకున్నాడో వారికి తిరిగి డబ్బులను అందజేశాడు.
అంతేకాకుండా, విచారణ తర్వాత రైల్వే ఆదేశాలను లెక్కచేయకుండా అధిక ధరకు వాటర్ బాటిల్లను విక్రయించడం దుకాణం సదర్ క్యాటరింగ్ సంస్థకు ఏకంగా లక్ష రూపాయలు ఫైన్ విధించింది రైల్వే శాఖ.