టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ఇటీవల వైఎస్ షర్మిల( YS Sharmila ) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపాయి.జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) తన చెల్లి గురించి మాట్లాడుతూ గతంలో బాలకృష్ణ తన ఇంట్లో నుంచి తన చెల్లి గురించి అసత్య ప్రచారాలు చేయించారని చెప్పారు.
అయితే ఈ విషయంపై స్పందించిన షర్మిల నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నాను ఇప్పటివరకు ప్రభాస్( Prabhas ) అంటే ఎవడో కూడా నాకు తెలియదు అంటూ ఆయన గురించి ఏకవచనంతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా ప్రభాస్ ఎవడో నాకు తెలియదు ఇప్పటివరకు నేను అతనిని చూడలేదు అంటూ షర్మిల మాట్లాడిన తీరు ప్రభాస్ అభిమానులను( Prabhas Fans ) ఆగ్రహానికి గురిచేస్తుంది.ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో గురించి ఇలా ఏకవచనంతో మాట్లాడటం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ షర్మిలను టార్గెట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆమె మాట తీరుపై స్పందిస్తూ ప్రభాస్ ఎవడో నీకు తెలియదా అంటూ పాత విషయాలను బయటకు వెలికితీస్తూ షర్మిలకు కౌంటర్ ఇస్తున్నారు.

నిజానికి ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా( Yogi Movie ) పూజా కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా వైయస్ షర్మిల తండ్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి( YS Rakasekhar Reddy ) హాజరయ్యారు.ఇలా ఈ పూజా కార్యక్రమాలకు రాజశేఖరరెడ్డి హాజరు అయ్యి క్లాప్ కొట్టి సినిమా పనులను ప్రారంభించారు అయినా మీకు ప్రభాస్ అంటే ఎవరో నీకు తెలియదా అంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఇలా మా హీరో వ్యక్తిత్వం పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ షర్మిలకు వార్నింగ్ ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.
మరి అభిమానులు చేస్తున్న ఈ కామెంట్లపై షర్మిల స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.