Onion Hair Growth Serum : ఉల్లి తొక్కలతో హెయిర్ గ్రోత్ సీరం.. ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసా?

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నిత్యం ఉల్లిపాయలు విరివిరిగా వాడుతుంటారు.ఉల్లిపాయ లేనిదే ఏ కూర చేయలేరు.

 How To Make Hair Growth Serum With Onion Peel-TeluguStop.com

ఒకవేళ చేసిన సరైన రుచి రాదు.ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.

ఉల్లిపాయలు వాడే క్రమంలో వాటి తొక్కలను దాదాపు ప్రతి ఒక్కరు డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.కానీ ఉల్లిపాయలే కాదు ఉల్లి తొక్కలు( Onion Peel ) కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి.

ముఖ్యంగా జుట్టు సంరక్షణకు ఉల్లి తొక్కల సీరం అద్భుతంగా ఉపయోగపడుతుంది.జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెంచడానికి తోడ్పడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఉల్లి తొక్కలతో హెయిర్ గ్రోత్ సీరం ను( Hair Growth Serum ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

అలాగే రెండు కప్పులు ఉల్లిపాయ తొక్కలు వేసుకోవాలి.ఉల్లి తొక్కల తో పాటు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Cloves ) మరియు రెండు అంగుళాల దాల్చిన చెక్క( Cinnamon ) వేసి మరిగించాలి.

దాదాపు 15 నిమిషాల పాటు మరిగిస్తే వాటర్ పూర్తిగా కలర్ చేంజ్ అవుతుంది.అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Serum, Healthy, Latest, Peel, Peel Benefits, Peel Serum,

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరం ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరం ను వాడారంటే మస్తు బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

Telugu Care, Care Tips, Serum, Healthy, Latest, Peel, Peel Benefits, Peel Serum,

ఈ న్యాచుర‌ల్ సీరం జట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.అదే సమయంలో జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది.

అలాగే చుండ్ర‌ సమస్య ఉన్న కూడా ఈ సీరంను వాడవచ్చు.ఈ సీరం ఇన్ఫెక్షన్ ను నివారించి చుండ్రును దూరం చేస్తుంది.

స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తుంది.కాబట్టి ఒత్తైన ఆరోగ్యమైన కురులను కోరుకునే వారు తప్పకుండా ఈ ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube