Onion Hair Growth Serum : ఉల్లి తొక్కలతో హెయిర్ గ్రోత్ సీరం.. ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసా?

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నిత్యం ఉల్లిపాయలు విరివిరిగా వాడుతుంటారు.ఉల్లిపాయ లేనిదే ఏ కూర చేయలేరు.

ఒకవేళ చేసిన సరైన రుచి రాదు.ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.

ఉల్లిపాయలు వాడే క్రమంలో వాటి తొక్కలను దాదాపు ప్రతి ఒక్కరు డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.

కానీ ఉల్లిపాయలే కాదు ఉల్లి తొక్కలు( Onion Peel ) కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి.

ముఖ్యంగా జుట్టు సంరక్షణకు ఉల్లి తొక్కల సీరం అద్భుతంగా ఉపయోగపడుతుంది.జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెంచడానికి తోడ్పడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఉల్లి తొక్కలతో హెయిర్ గ్రోత్ సీరం ను( Hair Growth Serum ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

అలాగే రెండు కప్పులు ఉల్లిపాయ తొక్కలు వేసుకోవాలి.ఉల్లి తొక్కల తో పాటు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Cloves ) మరియు రెండు అంగుళాల దాల్చిన చెక్క( Cinnamon ) వేసి మరిగించాలి.

దాదాపు 15 నిమిషాల పాటు మరిగిస్తే వాటర్ పూర్తిగా కలర్ చేంజ్ అవుతుంది.

అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

"""/" / ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన సీరం సిద్ధం అవుతుంది.

ఈ సీరం ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరం ను వాడారంటే మస్తు బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

"""/" / ఈ న్యాచుర‌ల్ సీరం జట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.అదే సమయంలో జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది.అలాగే చుండ్ర‌ సమస్య ఉన్న కూడా ఈ సీరంను వాడవచ్చు.

ఈ సీరం ఇన్ఫెక్షన్ ను నివారించి చుండ్రును దూరం చేస్తుంది.స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తుంది.

కాబట్టి ఒత్తైన ఆరోగ్యమైన కురులను కోరుకునే వారు తప్పకుండా ఈ ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తారకరత్న కుటుంబానికి ఎన్టీఆర్ చేసిన సాయం తెలుసా.. మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!