ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో డయాబెటిస్ ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది.
ఇంకా చెప్పాలంటే మారుతున్న జీవన విధానం వల్ల కూడా ఈ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు.అలాగే టైప్ టు డయాబెటిస్ రోగుల పై జరిపిన పరిశోధనల లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ముఖ్యంగా చెప్పాలంటే బ్రిటిష్ జర్నర్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించిన వివరాల ప్రకారం వేగంగా నడవడం వల్ల టైప్ టు డయాబెటిస్ సమస్య తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతి రోజు గంటకు నాలుగు కిలో మీటర్ల వేగంతో నడిస్తే డయాబెటిస్ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే నడక వేగం పెరిగితే టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉంటుందని పరిశోధనలలో తెలిసింది.అలాగే గంటకు కనీసం నాలుగు నుంచి ఐదు కిలో మీటర్ల వేగంతో నడిస్తే డయాబెటిస్ బారిన పడకుండా ఉండవచ్చనీ నిపుణులు చెబుతున్నారు.
దీని ప్రకారం పురుషులు నిమిషానికి 87 అడుగులు వేయాలని, మహిళలు అయితే నిమిషానికి 100 అడుగులు నడిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అంతే కాకుండా 2024 వ సంవత్సరం నాటికి టైప్ టు డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య 537 మిలియన్ల నుంచి 783 మిలియన్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఇరాన్ లోని సెమినార్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ పరిశోధకులు వేగంగా నడవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల కేవలం డయాబెటిస్ నీ నివారించడమే కాకుండా అనేక సామాజిక మానసిక, శరీరక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాబట్టి వేగంగా నడిచి టైప్ టు డయాబెటిస్ సమస్య ను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.