రాజకీయాల్లో గొడవలు అంటే కేవలం కాంగ్రెస్ (Congress) అని చెప్పుకోవచ్చు.అయితే మిగతా పార్టీలలో కూడా గొడవలు ఉంటాయి కానీ కాంగ్రెస్ అంతా బహిరంగంగా మాత్రం ఇతర పార్టీల నేతలు పెట్టుకోరు.
అయితే తాజాగా తెలంగాణ బిజెపి (Telangana BJP) లో అలాంటి గొడవ చోటు చేసుకుంటుంది.అదేంటంటే సభాపక్ష నేతగా ఎవరు ఉంటారు అనేది బిజెపి అధిష్టానం ఎటూ తెల్చూకోలేక పోతుందట.
దీంతో తెలంగాణ బిజెపి సభా పక్ష నేత ఎవరు అనేది దానిలో ముగ్గురు నేతల మధ్య గట్టి పోటీ ఉందని తెలుస్తోంది.ఈ ముగ్గురు నేతల కు సంబంధించిన వాళ్ళు సభా పక్ష నేతగా మా నేతకి ఇవ్వాలి అంటే మా నేతకే ఇవ్వాలి అంటూ లోలోపల మాటలు యుద్ధాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక విషయంలోకి వెళ్తే.బిజెపి పార్టీ నుండి గతంలో కేవలం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మాత్రమే గెలుపొందాడు.దాంతో శాసనసభలో సభా పక్ష నేతగా వ్యవహరించారు.ఇక ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు గెలిచినప్పటికీ రాజసింగ్ మాత్రమే ఆ పదవిలో కొనసాగారు.
అలాగే రాజాసింగ్ ని బిజెపి సస్పెండ్ చేసినప్పటికీ ఆయన స్థానం నుండి తొలగించలేదు.అయితే ఈసారి కూడా రాజా సింగ్ కే ఇవ్వాలి అని కొంతమంది భావిస్తున్నారట.
కానీ ఇంకొంతమంది మాత్రం కామారెడ్డిలో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటేపల్లి వెంకటరమణారెడ్డి (Katepalli Venkataramana Reddy) కి ఫ్లోర్ లీడర్ గా ఛాన్స్ ఇవ్వాలి అని మరి కొంతమంది భావిస్తున్నారట.అయితే ఇంకొంతమందేమో నిర్మల్ నియోజకవర్గం లో గెలిచిన మహేశ్వర్ రెడ్డికి చాన్స్ ఇవ్వాలి అని భావిస్తున్నారట.అయితే ఈ ముగ్గురిలో ఎవరికి కూడా రాష్ట్ర సమస్యలపై కూసింత పట్టు కూడా లేదు.రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానిపై అంతగా అవగాహన కూడా ఉండదు.
అలాగే ఈ ముగ్గురు కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన వారు.అయితే ఈ ముగ్గురిలో కాస్త కూస్తో మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) కి కాస్త రాష్ట్ర రాజకీయాలపై పట్టు ఉందని తెలుస్తోంది.దాంతో కొంతమంది ఈయనకు మద్దతు తెలిపినప్పటికీ ఈ ముగ్గురు నేతల మధ్య మాత్రం గట్టి పోటీ ఉందట.మరి చూడాలి బిజెపి అధిష్టానం అసెంబ్లీలో సభా పక్ష నేతగా ఏ నాయకుడికి అవకాశం ఇస్తారో