టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.ఇప్పటికే వరుసగా 4 సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య బాబు.
ఇప్పుడు త్వరలో అఖండ 2( Akhanda 2 ) మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు బాలయ్య బాబు.

ఇక బాలయ్య బాబు హీరో మాత్రమే కాదు ఒక పొలిటిషన్ కూడా ఉన్నాడు అని రాజకీయాలలో తెలిసిన విషయం తెలిసిందే.అలాగే గొప్ప హోస్ట్ అన్న విషయం అన్ స్టాపబుల్ షో( Unstoppable Show ) తో తెలిసింది.సెలబ్రిటీలను తన మాటలతో ఇరకాటంలో పెట్టడంలోనూ మహా ఘనా పాటి అని చాటి చెప్పారు.ఈ షో తో తనలో ఉన్న మరొక టాలెంట్ ని బయటపెట్టారు బాలయ్య బాబు.
తాజాగా డ్రమ్స్ కూడా వాయించి తనలో ఉన్న మరో టాలెంట్ ని కూడా బయటపెట్టారు బాలయ్య బాబు.ఈ ట్యాలెంట్ కూడా ఉందని నిరూపించారు.తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్( NTR Trust ) ఆధ్వర్యంలో టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ కన్సర్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

యుఫోరియా పేరుతో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మ్యూజికల్ నైట్ షో జరిగింది.అతిరధ మహారధుల సమక్షంలో బాలయ్య డ్రమ్స్ వాయించి ప్రేక్షకుల్ని అలరించారు.ప్రముఖ డ్రమ్మర్ శివమణి( Drummer Sivamani ) డ్రమ్స్ వాయించడం ఒక ప్రత్యేక అయితే బాలయ్య తోడవ్వడం మరో ఆకర్షణగా మారింది.శివమణితో బాలయ్య జత కట్టడంతో వేడుక మరింత గొప్పగా సాగింది.
ప్రొఫెషనల్ వాయిద్య కారుడిలా బాలయ్య డ్రమ్స్ ప్లే చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.బాలయ్య ను అలా చూసి అభిమానులే స్టన్ అయిపోతున్నారు.
ఏంటి మా అభిమాన హీరోలో ఈ ట్యాలెంట్ కూడా ఉందని షాక్ అవుతున్నారు.దీంతో నెట్టింట బాలయ్య ట్యాలెంట్ ను ఉద్దేశించి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.