ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో సైతం తనను తాను స్టార్ ను చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
మరి ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే విషయం మనందరికి తెలిసిందే.ఇప్పుడు రాజమౌళితో( Rajamouli ) చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా వరకు ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు…

ఇప్పటికే రాజమౌళి తో చేస్తున్న సినిమా మీద భారీ కసరత్తులైతే చేస్తున్నాడు.ఇక ఇంటర్వెల్ లోకి మహేష్ బాబు ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాడట.ఈ సినిమా ఇంటర్వెల్ ఫైట్( Interval Fight ) సింహంతో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక ట్రిపుల్ ఆర్( RRR ) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పులితో ఫైట్ చేశాడు.మరి మహేష్ బాబు ఈ సినిమాలో సింహంతో ఫైట్ చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నిధి వేటలో సాగుతుంది.కాబట్టి నిధి కోసం వెళ్లే క్రమంలో సింహం( Lion ) ఎదురైతే దానిని చంపి ముందుకు దూసుకెళ్తారట.

మరి ఇలాంటి సందర్భంలోనే ఇటు విలన్స్ ని అటు జంతువులను, నర రూప రాక్షసులను సైతం దాటుకుంటూ మహేష్ బాబు నిధి కోసం ముందుకు దూసుకెళ్లే సీన్స్ అద్భుతంగా ఉంటాయని వాటిని థియేటర్లో చూస్తే ఒక్కొక్కరికి పూనకాలు వస్తాయని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని వరల్డ్ మొత్తాన్ని షేక్ చేయాలనే చూస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అనేది…
.