ప్రేమ గుడ్డిది అంటారు కానీ ఈ ప్రేమ( Love ) మరీ విడ్డూరంగా ఉంది అంటున్నారు నెటిజన్లు.65 ఏళ్ల యూరోపియన్ వృద్ధుడు తన భార్యను వదిలేసి, నైజీరియాలో( Nigeria ) టిక్‌టాక్( TikTok ) ద్వారా పరిచయమైన యంగ్ గర్ల్‌ఫ్రెండ్‌ను( Young Girlfriend ) పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు.దీంతో ఆ తాత ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోయి, ఇది కచ్చితంగా స్కామ్ అని గగ్గోలు పెడుతున్నారు.
విషయంలోకి వెళ్తే.65 ఏళ్ల ఈ వృద్ధుడికి టిక్‌టాక్‌లో ఓ 20-25 ఏళ్ల నైజీరియన్ అమ్మాయితో పరిచయం ఏర్పడింది.ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తూ ప్రేమలో పడిపోయారు.
దాంతో ఇక తన భార్యను వదిలించుకుని, నైజీరియా వెళ్లి తన టిక్‌టాక్ లవర్‌ను( TikTok Lover ) పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు.అది కూడా ఎప్పుడు? సంవత్సరం నుంచి ఆమెతో చాటింగ్ చేస్తున్నప్పుడే డిసైడ్ అయిపోయాడంట.అంతేకాదు, అప్పటినుంచి ఆమెకు బోలెడు డబ్బులు పంపించాడట.వీసా కోసం డబ్బులు, ఇంకా రకరకాల ఖర్చుల కోసం అని చెప్పి చాలా డబ్బులు గుమ్మరించాడు.
కానీ ఇప్పటివరకు వీసా మాత్రం రాలేదు.

ఇదంతా తన మేనల్లుడు రెడిట్‌లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.“మా తాతకు 65 ఏళ్లు పైనే ఉంటాయి.పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.
అలాంటి వ్యక్తి ఏడాది క్రితం టిక్‌టాక్‌లో ఓ యంగ్ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు.చాటింగ్ చేస్తూ ప్రేమలో పడిపోయారు.
అప్పటినుంచి ఆమెకు చాలా డబ్బు పంపించాడు” అని మేనల్లుడు వాపోయాడు.
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇది స్కామ్( Scam ) అని ఎంత చెప్పినా తాత మాత్రం వినిపించుకోవట్లేదంట.
తన ప్రేమ నిజమైనది అని నమ్ముతున్నాడు.ఒకవేళ నైజీరియా వెళ్తే తన తాతకు ప్రాణహాని కూడా ఉండొచ్చని ఫ్యామిలీ భయపడుతోంది.“నైజీరియా వెళ్తే మా తాతయ్యను దోచుకుంటారేమో, టార్చర్ చేస్తారేమో, లేదంటే చంపేస్తారేమో అని భయంగా ఉంది” అని మేనల్లుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

రెడిట్ యూజర్లు కూడా ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు.చాలామంది ఇది బ్యాడ్ ఎండింగ్‌తో కూడుకున్న స్టోరీ అని కామెంట్ చేస్తున్నారు.“ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక అమ్మాయి ముఖం చాటేస్తుంది.ఏదో ఒక సాకు చెప్పి కలవడానికి రాదు.ఆ తర్వాత డబ్బులు కావాలని మళ్లీ అడుగుతూనే ఉంటుంది.ఇదే సైకిల్ కంటిన్యూ అవుతుంది” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
మరో యూజర్ అయితే స్కామ్ ఎలా జరుగుతుందో కూడా ఊహించి చెప్పాడు.“ఆమె ఫోన్ చేసి తాను జైలులో ఉన్నానని, బయటకు రావడానికి లంచం కావాలని అంటుంది.అతను డబ్బులు పంపిస్తాడు, ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
కానీ ఆమె రాదు.ఆ తర్వాత తన బస్సు బ్రేక్ డౌన్ అయిందని, మళ్లీ డబ్బులు కావాలని అంటుంది.
ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది” అని ఇంకో యూజర్ స్కామ్ ఎలా ఉంటుందో వివరించాడు.
ఇదే ఆ రెడిట్ పోస్ట్
.by in