కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో అశ్వత్ మురిముత్తు( Director Ashwath Marimuthu ) ఒకరు.అశ్వత్ మురిముత్తు డ్రాగన్ సినిమా( Dragon Movie ) ఈవెంట్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మహేష్ బాబు( Mahesh Babu ) వల్లే నాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని అన్నారు.నా సినిమా ఓ మై కడవులే( Oh My Kadavule ) పోస్టర్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వ్యూస్ వచ్చాయని ఆయన తెలిపారు.
ఆ స్థాయిలో వ్యూస్ రావడానికి రీజన్ ఏంటో మొదట నాకు తెలియలేదని ఆయన చెప్పుకొచ్చారు.ఆ తర్వాత మహేష్ బాబు మా సినిమాను మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టారని తెలిసిందని ఆయన తెలిపారు.3 కోట్ల రూపాయలతో ఆ సినిమాను నిర్మించామని ఇది చాలా చిన్న సినిమా అని దర్శకుడు అన్నారు.తెలుగులో మహేష్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయనతోనే మొదటి సినిమా చేస్తానని మహేష్ తో మూవీ చేయాలనేది నా చిరకాల కోరిక అని పేర్కొన్నారు.

ఓ మై కడవులే మూవీ ప్రొడ్యూసర్స్ నుంచి ఎలాంటి రిక్వెస్ట్ లేకుండానే మహేష్ బాబు ఆ సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారని అశ్వత్ మురిముత్తు తెలిపారు.మహేష్ బాబు వల్లే తెలుగు డైరెక్టర్లు, నటీనటులు ఓ మై కడవులే సినిమాను చూసి అభినందించారని ఆయన పేర్కొన్నారు.ఈ సినిమా ఓరి దేవుడా పేరుతో తెలుగులో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.

డ్రాగన్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్( Pradeep Ranganathan ) హీరోగా నటించగా ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.అశ్వత్ మురిముత్తు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అశ్వత్ మురిమత్తు తెలుగులో మాట్లాడుతూ కామెంట్లు చేయడం గమనార్హం.
అశ్వత్ మురిముత్తు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.