వేసవికాలంలో ఎండలు మండిపోతున్న కారణంగా ప్రయాణం చేసే వారంతా కచ్చితంగా కొబ్బరి నీటిని తీసుకుంటూ ఉంటారు.కొబ్బరికాయకు దేశవ్యాప్తంగా భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది.
అయితే వేసవికాలంలో శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి కొబ్బరి ఒక చౌకైన ఆరోగ్యకరమైన మార్గం.దీన్ని తాగడానికి చిన్న, పెద్ద ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు.
అయితే చాలామంది కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత గ్రోల్ ను విసిరేస్తుంటారు.
అయితే ప్రఖ్యాత భారతీయ(Indian) పోషకాహార నిపుణుడు కారిపోయిన లేత కొబ్బరి(tender coconut) తినాలని లేకపోతే దాని వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతారని సలహా ఇచ్చారు.
ఎందుకంటే లేత కొబ్బరి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.లేత కొబ్బరి తినడం వల్ల క్యాలరీలు పెరుగుతాయను అలాగే ఉబకాయం(obesity) వచ్చే అవకాశం ఉందని చాలామంది భయపడుతూ ఉంటారు.అయితే ఇది వాస్తవం కాదు.
పరిమిత పరిమాణంలో తీసుకుంటే పొట్ట అలాగే నడుము కొవ్వు క్రమంగా తగ్గడం ప్రారంభం అవుతుంది.

అజీర్తి సమస్యలు ఉన్నవారు లేత కొబ్బరిని తింటే జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది.ఎందుకంటే ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.అదేవిధంగా ప్రజలను కూడా ఆరోగ్యంగా చేస్తుంది.
అదేవిధంగా కొబ్బరిని తీసుకోడంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తి పెరిగేందుకు సహాయపడతాయి.

వేసవి కాలంలో చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.తేమతో కూడిన ఉష్ణోగ్రత వల్ల చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది.అలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లను తీసుకుంటే చాలా మంచిది.లేదా కొబ్బరి తింటే ముఖం అద్భుతమైన మెరుపు ను కలిగి ఉంటుంది.అదేవిధంగా అలసటగా, నీరసంగా అనిపించినప్పుడు కొబ్బరి నీటిని తాగితే రిఫ్రెష్ అనుభూతిని పొందవచ్చు.







