అక్ష పార్థాసాని. తెలుగులో ఒకప్పుడు తళుక్కున మెరిసిన హాట్ బ్యూటీ.
ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో వచ్చిన యువత అనే సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్‌గా పరిచయం అయింది.తొలి సినిమాతోనే చక్కటి నటనతో పాటు లేలేత అందాలతో వారెవ్వా అనిపించుకుంది.
హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది.తన అందం, అభినయంతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే ఆమెకు పెద్ద అవకాశాలు రాలేదు.కొన్ని సినిమాల్లోనే నటించింది.
ఆ సినిమలు సైతం బాక్సీఫీస్ దగ్గర పెద్దగా విజయాలు సాధించలేదు.దీంతో తనకు అవకాశాలు ఇచ్చేందుకు ఎవరూ సాహసించలేదు.
అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది.ఇంటి దగ్గరే కాలక్షేపం చేస్తుంది.ఆమె తెలుగులో చివరగా శర్వానంద్ నటించిన రాధ సినిమాలో నటించింది.ఇందులో గెస్ట్ రోల్ పోషించింది.
ప్రస్తుతం పలు షాపింగ్ మాల్స్, కాలేజీ వేడుకల్లో పాల్గొంటుంది.తాను లైమ్ లైట్లోనే ఉన్నట్లు చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతుంది.
నిజానికి ఆమెకు మంచి హాట్ ఇమేజ్ ఉన్నా సినిమాల్లో సక్సెస్ కాలేదు.కాలం తనకు అనుకూలంగా లేకపోడం మూలంగా రాణించలేకపోతుంది.
అటు ఈ హాట్ బ్యూటీ ఈ ఏడాది తొలి నాళ్లలో వెబ్ సిరీస్ లో కూడా నటించింది.జమ్తారా జమ్తారా – సబ్‌కే నెంబర్ ఆయేగా అనే వెబ్ సీరిస్‌లో కీలక పాత్ర పోషించింది.ఇందులో తన నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.ఏ అవకాశం లేదని ఖాళీగా ఉండటం కంటే.ఏదో ఒక పని చేయాలని భావిస్తున్న ఈ ముద్దుగుమ్మ అవకాశం వచ్చిన ప్రతి చోటా నటనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.ఈ వెబ్ సిరీస్ తర్వాత తనకు మరికొన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
అటు సినిమా ఆఫర్ల కోసం సైతం ఆమె ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఏం చేసైనా సరే ఒక్క అవకాశాన్ని దక్కించుకుని సక్సెస్ కావాలని భావిస్తుంది అక్ష పార్థాసాని.