సినిమా అనేది ప్రతి చాలా మందికి జీవనోపాధిని కల్పిస్తుంది.ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ఏదో ఒక సినిమా చేసి సక్సెస్ ని సాధించి స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయాలని చూస్తూ ఉంటాడు.
మరి ఇలాంటి సందర్భంలో యంగ్ హీరోలు అందరూ స్టార్ హీరో రేస్ లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు.ఇక ఇప్పటికే నాగచైతన్య( Naga Chaitanya ) లాంటి నటుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు.

తండేల్( Thandel ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ నెక్స్ట్ ‘కార్తీక్ వర్మ దండు’తో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని క్రియేట్ చేసుకోవాలని స్టార్ హీరో రేంజ్ లో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పుడు మోక్షజ్ఞ( Mokshagna ) కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు.కాబట్టి నందమూరి ఫ్యామిలీ చిన్నోడు కూడా ముందుకు తీసుకెళ్తే మాత్రం అక్కినేని ఫ్యామిలీ చాలా వరకు వెనుకబడిపోతుంది.అందువల్లే ఈ గ్యాప్ లోనే వీళ్ళు భారీ విజయాలను సాధించి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటే పర్లేదు కానీ లేకపోతే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండటం విశేషం…

మరి వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకుంటున్న ఈ స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు…మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ లేదు గానీ ఆయన వస్తే అక్కినేని హీరోల( Akkineni Heroes ) మీద ప్రేషర్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది…కాబట్టి వాళ్ళు ఇప్పుడే భారీ విజయాలను సాధించాల్సిన అవసరం అయితే ఉంది…చూడాలి మరి అక్కినేని హీరోలు సూపర్ సక్సెస్ అవుతారా లేదా అనేది…
.







