అక్కినేని హీరో నాగచైతన్య( Naga Chaitanya ) హీరోగా నటించిన తాజా చిత్రం తండేల్.( Thandel ) చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి( Sai Pallavi ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంది.ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
కోడ్ల ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు 100 కోట క్లబ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.నాగచైతన్య ఎప్పుడెప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు తండేలు మూవీతో నాగచైతన్య కూడా 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టేసారు.

ఇప్పటివరకు అక్కినేని హీరోలు ఎవరూ కూడా ఈ రికార్డును సాధించలేకపోయారు.అక్కినేని ఫ్యామిలీలో మొదట 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన హీరోగా నాగచైతన్య రికార్డును క్రియేట్ చేశారు.తండేల్ చిత్రంతో సెకండ్ వీకండ్ పూర్తి కాకుండానే నాగ చైతన్య 100 కోట్లు గ్రాస్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.
ఇటీవల ఫిబ్రవరి 7 న పాన్ ఇండియా లెవల్ మూవీ గా విడుదలైన తండేల్ చిత్రం తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది.హిట్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కు రీచ్ అయిన తండేల్ చిత్రం పాన్ ఇండియా ఆడియన్స్ కు ఎక్కలేదు.

నార్త్ లో ఇరగదీస్తోంది అనుకుంటే నార్త్ ఆడియన్స్ ను తండేల్ డిజప్పాయింట్ చెయ్యడంతో అక్కడ కలెక్షన్స్ మరీ వీక్ గా ఉన్నాయి.ఇక రెండో వారం అంటే వాలంటైన్స్ డే కి విడుదలైన తెలుగు చిత్రాలేవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నాగ చైతన్య తండేల్ సినిమాకు బాగా కలిసొచ్చింది.దానితో సెకండ్ వీకెండ్ పూర్తి కాకుండానే తండేల్ అఫీషియల్ గా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల క్లబ్బు లోకి అడుగుపెట్టింది.దానితో అక్కినేని ఫ్యామిలిలో మొదటి 100 కోట్ల హీరోగా నాగ చైతన్య నిలిచాడు.
దీంతో మూవీ మేకర్స్ తో పాటు అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.