భారతీయ పెళ్లిళ్లంటేనే చాలా సందడి నెలకొంటుంది.సరదా సరదాగా ఆటపట్టించడం, చిలిపి పనులు చేయడం మామూలే.
పెళ్లి కొడుకును( Groom ) ఆటపట్టించడానికి స్నేహితులు, బంధువులు రకరకాల పనులు చేస్తుంటారు.చెప్పులు దొంగిలించడం, డబ్బులు తీసుకోవడం వంటి ప్రాంక్‌లు( Pranks ) చేస్తారు.
కానీ ఇప్పుడు ఓ కొత్త రకం ప్రాంక్ వైరల్ అవుతోంది.అదేంటంటే, పెళ్లి కొడుకు డ్రింక్‌లో సీక్రెట్ గా మందు కలపడం.
అంటే వరుడు చేత మందు తాగించి, అతడిని నవ్వులు పాలు చేయించాలని ఫ్రెండ్స్, బంధువులు ట్రై చేస్తున్నారు.
ఇక తాజాగా ఇలాంటి ప్రాంక్‌ని చూపించే ఒక వీడియో వైరల్( Viral Video ) అయింది.
దీన్ని అభిర్ బిస్వాస్ అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేశాడు.అందులో అభిర్ చేతిలో ఫ్రూటీ( Frooti ) టెట్రా ప్యాక్, పక్కనే ఓల్డ్ మంక్ రమ్ బాటిల్ ఉన్నాయి.
ఫ్రూటీలో కొంచెం రమ్ కలిపి, పెళ్లి మండపంలో ఉన్న పెళ్లి కొడుకు దగ్గరకు వెళ్లాడు.నవ్వుతూ ఆ డ్రింక్ పెళ్లి కొడుకుకి ఇచ్చాడు.అతను కూడా ఏమీ అనుమానించకుండా గుటకేశాడు.
ఆపై ఒక్క క్షణం పెళ్లి కొడుకు బిత్తరపోయాడు.‘ఇదేంటి?’ అన్నట్టుగా చూశాడు.ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది.‘అమ్మో, ఫ్రూటీలో మందు కలిపాడా?’ అన్న ఎక్స్‌ప్రెస్ ఇచ్చాడు.అతని అమాయకపు రియాక్షన్ వీడియోకి మరింత కామెడీని జోడించింది.
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోకి ఇన్‌స్టాలో 6.4 కోట్ల వ్యూస్ వచ్చాయి.నెటిజన్లు మిక్స్డ్ రియాక్షన్స్ ఇచ్చారు.
కొందరికి నవ్వు ఆగలేదు.కానీ చాలా మంది మాత్రం తప్పు పట్టారు.
పెళ్లి పవిత్రమైన కార్యక్రమం అని, ఇలాంటి చోట మందు తాగించడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేశారు.
ఒక యూజర్ ‘పెళ్లిళ్లు పవిత్రమైనవి, డ్రామాల కోసం కాదు’ అని కామెంట్ చేస్తే, ఇంకొకరు ‘సిగ్గుండాలి, పూజలో కూర్చున్న వ్యక్తికి మందు ఇచ్చావా?’ అని తిట్టారు.కానీ చాలా మంది నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు.ఈ ప్రాంక్ సరదా కోసమేనా, లేక హద్దులు దాటిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.