బాలీవుడ్ నటుడిలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విక్కీ కౌశల్ ( Vicky Kaushal ) ఒకరు.బాలీవుడ్ హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న ఈయన తాజాగా ఛావా( Chhaava ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది.ఇక ఈ సినిమా చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమాలో శంబాజీ భార్య ఏసు భాయ్ పాత్రలు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) నటించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో ఈమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.నిజానికి ఈ సినిమా మొదటి ఆప్షన్ విక్కీ కౌశల్ కాదని ఓ టాలీవుడ్ హీరోకి ఈ సినిమా అవకాశం వచ్చిన ప్రతి మిస్ చేసుకున్నారని తెలుస్తోంది.మరి ఆ సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరనే విషయానికి వస్తే…

డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్( Director Laxman Utekar ) ఈ సినిమా కథతో ముందుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ని కలిసారని తెలుస్తుంది.మహేష్ బాబుకు ఈ కథ వివరించినప్పటికీ ఆయన మాత్రమే సినిమా చేయటానికి ఆసక్తి చూపలేదట దీంతో డైరెక్టర్ లక్ష్మణ్ కొంతకాలం పాటు పక్కన పెట్టారని అనంతరం బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని కలిసి ఈ సినిమా కథ వివరించగా వెంటనే ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తుంది.మొదటగా హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కత్రిన కైఫ్( Katrina Kaif ) ను అనుకోగా ఆమె కూడా నో చెప్పడంతో రష్మికను ఎంపిక చేసినట్టు సమాచారం మరి ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.