పార్లమెంట్‌లో తప్పుడు సాక్ష్యం .. సింగపూర్‌లో దోషిగా తేలిన భారత సంతతి నేత

సింగపూర్( Singapore ) ప్రతిపక్ష నేత భారత సంతతికి చెందిన ప్రీతమ్ సింగ్ .( Pritam Singh ) సోమవారం పార్లమెంటరీ కమిటీకి( Parliamentary Committee ) తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు దోషిగా తేలింది.

 Indian-origin Opposition Leader Pritam Singh Found Guilty Of Giving False Testim-TeluguStop.com

ఈ తీర్పు ప్రకారం ఆయనను పార్లమెంట్ నుంచి అనర్హులుగా ప్రకటించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పార్లమెంట్‌లో అబద్ధం చెప్పినట్లు తేలిన తన వర్కర్స్ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యురాలు రయీసాఖాన్‌కు( Raeesah Khan ) సంబంధించిన రెండు ఆరోపణలపై డిప్యూటీ ప్రిన్సిపల్ జిల్లా ల్యూక్ టాన్ సింగ్‌ను దోషిగా నిర్ధారించారు.

డిసెంబర్ 10, డిసెంబర్ 15, 2021న ఖాన్ కేసుపై విచారణ సందర్భంగా ప్రివిలేజ్ కమిటీకి ప్రీతమ్ సింగ్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాధానాలు అందించాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

Telugu Indian, Pritam Singh, Pritamsingh, Raeesah Khan, Singapore, Singaporeprit

రయీసా ఖాన్‌ కేసుపై పార్లమెంట్‌లో అబద్ధాలు మాట్లాడినందుకు గాను గతేడాది మార్చి 19న ప్రీతమ్ సింగ్‌పై కోర్టులో అభియోగాలు మోపారు.లైంగిక వేధింపుల కేసుపై ఖాన్ 2021లో పార్లమెంట్‌లో అబద్ధం చెప్పారని పోలీసులు తప్పుగా కేసును డీల్ చేశారని ఆరోపించారు.48 ఏళ్ల ప్రీతమ్ సింగ్ గతేడాది వర్కర్స్ పార్టీ( Workers Party ) సెక్రటరీ జనరల్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆయన 2018 నుంచి ఆ పార్టీకి సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Indian, Pritam Singh, Pritamsingh, Raeesah Khan, Singapore, Singaporeprit

తాజా నేరానికి గాను ప్రీతమ్ సింగ్‌కి మూడేళ్ల జైలు శిక్ష . 7000 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా లేదా రెండూ విధించబడే అవకాశం ఉంది.సింగపూర్ రాజ్యాంగం ప్రకారం కనీసం 10000 సింగపూర్ డాలర్ల జరిమానా లేదా కనీసం ఒక సంవత్సరం పాటు జైలు శిక్షను ఎదుర్కొన్న వ్యక్తి పోటీ చేయడానికి , ఐదేళ్ల పాటు పార్లమెంటరీ సీటులో కూర్చోవడానికి అనర్హుడు.

1959 నుంచి సింగపూర్ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీ రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది.కానీ వర్కర్స్ పార్టీని పెరుగుతున్న ప్రతిపక్ష శక్తిగా చూశారు.

రాబోయే ఎన్నికలు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌కు మొదటి ప్రధాన రాజకీయ పరీక్ష కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube