చక్కెర.ప్రతి రోజు ఏదో ఒక విధంగా వాడే వాటిల్లో ఇది ఒకటి.ముఖ్యంగా మార్నింగ్ టీ, కాఫీల్లో ఖచ్చితంగా షుగర్‌ను తీసుకుంటారు.స్వీట్స్ రూపంలో కూడా చక్కెరను తీసుకుంటారు.అయితే కొందరు మాత్రం చక్కెరకు చాలా దూరంగా ఉంటారు.చక్కెర ఆరోగ్యానికి హాని చేస్తుంది.
అధిక బరువు, మధుమేహం, గుండె జబ్బులు ఇలా ఇతరితర సమస్యలు వస్తాయని భయపడతారు.ఈ క్రమంలోనే చక్కెరను ఎవైడ్ చేస్తారు.
అవును, చక్కెర ఆరోగ్యానికి హానికరమే.కానీ, ఎలాంటి చక్కెర ఆరోగ్యానికి చెడు చేస్తుందో తెలుసుకోవాలి.
వాస్తవానికి ముడి చక్కెరను మంచి రంగులోకి మార్చేందుకు.సల్ఫరిక్ యాసిడ్ తో ప్రాసెసింగ్ చేసి బ్లీచింగ్ చేస్తున్నారు.దీంతో చెక్కరలో విషపూరితమైన స్పటికాలు దాగుంటాయి.ఇలాంటి చక్కెర తింటే పైన చెప్పుకున్న సమస్యలు నిజంగానే వస్తాయి.
అయితే చెరుకుగడతో తయారయ్యే చక్కెరలో ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఉంటే.అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది.
అలాంటి స్వచ్ఛమైన చక్కెరను రెగ్యులర్‌గా తగిన మోతాదులో తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
నీరసం, అలసట వంటి సమస్యలను దూరం చేయడం చక్కెర అద్భుతంగా సహాయపడుతుంది.అవును, నీరసం లేదా అలసటగా ఉన్నప్పుడు చక్కెరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే.వెంటనే యాక్టివ్‌గా మారతారు.
అలాగే నేటి కాలంలో చాలా మంది దంపతులు సంతాన లేమి సమస్యతో బాధ పడుతున్నారు.అలాంటి వారు రెగ్యులర్‌గా స్వచ్ఛమైన చక్కెరను తగిన మోతాదులో తీసుకుంటే.
సంతానోత్పత్తిని పెంచుతుంది.
వాంతల సమస్యతో ఇబ్బంది పడే వారు కొద్దిగా చక్కెర తీసుకుంటే.
మంచి ఫలితం ఉంటుంది.అలాగే స్వచ్ఛమైన చక్కెరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే గనుక.
రక్తంలో యాసిడ్ లెవెల్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి.ఇక మోషన్స్ సమస్య ఉన్న వారు చక్కెరను తీసుకుంటే.
త్వరగా రికవర్ అవుతారు.అయితే ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా మాత్రం తీసుకోరాదు.