సాధారణంగా కొందరికి పెదాల చుట్టూ ఉన్న చర్మం నల్లగా మారుతుంటుంది.అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి.
ముఖ్యంగా కెఫిన్ ను అధికంగా తీసుకోవడం, డీహైడ్రేషన్, ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం తదితర కారణాల వల్ల పెదాలు చుట్టూ చర్మం నల్లగా మారుతుంటుంది.ఈ నలుపు కారణంగా ముఖ సౌందర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.
దాంతో పెదాలు చుట్టూ ఏర్పడిన నలుపును వదిలించుకోవడం కోసం తోచిన చిట్కాలన్నీ పాటిస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా పెదాల చుట్టూ నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు వేసి వాటర్ తో ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాల చుట్టూ అప్లై చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నిమ్మ చెక్కను తీసుకుని పెదాల చుట్టూ ఉండే చర్మాన్ని స్మూత్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే వారం రోజుల్లో పెదాల చుట్టూ నల్లగా మారిన చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.
కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.