ఆరోగ్యకరమైన, ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లో పిస్తా( Pista ) ఒకటి.విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ పిస్తాలో సమృద్ధిగా ఉంటాయి.
అందుకే చాలా మంది పిస్తా పప్పును తమ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటారు.అయితే పిస్తా పప్పు మాత్రమే కాదు పిస్తా పాలు కూడా ఎన్నో ఆరోగ్య లాభాలను చేకూరుస్తుందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే.పిస్తా పప్పును నానబెట్టి మిల్క్ ను తయారు చేస్తారు.పిస్తా మిల్క్ టేస్ట్ గా ఉండటమే కాదు హెల్తీ కూడా.
మెదడు ఆరోగ్యానికి పిస్తా పాలు చాలా మేలు చేస్తాయి.పిస్తా మిల్క్ లో విటమిన్ బి6( Vitamin B6 ) మెండుగా ఉంటుంది.
ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తికి సహాయపడుతుంది.అదే సమయంలో పిస్తా మిల్క్ మెమొరీ పవర్‌ను రెట్టింపు చేస్తాయి.
మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

పిస్తా పాలల్లో అధిక మొత్తంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్( Calcium, magnesium, phosphorus ) వంటి పోషకాలు ఎముకలను బలంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.కీళ్ల నొప్పులు బారిన పడకుండా కాపాడతాయి.అలాగే పిస్తా మిల్క్ మంచి ఎనర్జీ బూస్టర్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు.
నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ పిస్తా పాలు తాగితే.అందులోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరియు పీచు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
నీరసాన్ని తరిమికొడతాయి.శక్తి కోసం సహజమైన మార్గాన్ని కోరుకునే వారికి పిస్తా మిల్క్ గొప్ప ఎంపిక అవుతుంది.

పిస్తా మిల్క్ లో ఆరోగ్యకరమైన ఒమెగా-3 కొవ్వులు, మోనో అన్సాచ్యురేటెడ్ ( Omega-3 fats, monounsaturated )ఫ్యాట్లు ఉంటాయి, ఇవి హృదయ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.పిస్తా మిల్క్ లో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తాయి.చర్మానికి కొత్త మెరుపును అందిస్తాయి.అంతేకాకుండా పిస్తా మిల్క్ లో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి ఇవి అనువుగా ఉంటాయి.తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ కలిగిన పిస్తా పాలు రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతాయి.కాబట్టి, మధుమేహం ఉన్నవారు కూడా పిస్తా మిల్క్ ను తాగొచ్చు.