సాధారణంగా కొందరి కనురెప్పలు సహజంగానే ఒత్తుగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.కానీ, కొందరి కనురెప్పలు మాత్రం చాలా పల్చగా ఉంటాయి.
దాంతో చాలా మంది కృతిమ కనురెప్పలపై ఆధారపడితే.కొంత మంది మాత్రం న్యాచురల్‌గానే థిక్‌గా పెంచుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు.కానీ, ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే గనుక వేగంగా పల్చబడిన కనురెప్పలను ఒత్తుగా పెంచుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించడం వల్ల జెల్ తయారు అవుతుంది.
ఈ జెల్‌ను పల్చటి వస్త్రం సాయంతో సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల జెల్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక చిన్న బాక్స్‌లో వేసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని మస్కారా బ్రెష్ సాయంతో కనురెప్పలకు, కావాలి అనుకుంటే కనుబొమ్మలకు అప్లై చేసుకుని గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా మరియు సున్నితంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక అవిసె గింజల జెల్, ఆల్మండ్ ఆయిల్ మరియు కాఫీ పౌడర్ లో ఉండే ప్రత్యేక సుగుణాలు పల్చగా ఉన్న కనురెప్పలను ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
కాబట్టి, ఒత్తైన, ఆకర్షణీయమైన కనురెప్పలు కావాలనుకునే వారు ఈ సింపుల్ రెమెడీని ఖచ్చితంగా ట్రై చేయండి.