కేరళలోని( Kerala ) పోట్టాలో ఫెడరల్ బ్యాంక్( Federal Bank ) శాఖ నుంచి రూ.15 లక్షలు దొంగతనం చేసిన ఘటనలో ఎన్ఆర్ఐ నర్స్ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుడిని రిజో ఆంటోనీగా( Rijo Antony ) గుర్తించారు.దొంగతనానికి ఉపయోగించిన స్కూటర్ ఇంటి ముందు పార్క్ చేసి ఉంది.రిజో గత కొన్నేళ్లుగా మిడిల్ ఈస్ట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.అతని భార్య కువైట్‌లో( Kuwait ) నర్సుగా( Nurse ) పనిచేస్తోంది.
రిజో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడని, భార్య పంపిన డబ్బును దుర్వినియోగం చేశాడని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో రిజో దాదాపు రూ.47 లక్షలకు పైగా అప్పులు చేశాడు.తాను కేరళకు తిరిగి వస్తున్నట్లు అతని భార్య చెప్పడంతో అప్పు తీర్చడానికి గాను బ్యాంక్ దోపిడీకి ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు.

బ్యాంక్ సమీపంలోని చర్చికి రిజో క్రమంగా వెళ్లేవాడని, దీంతో ఆ ప్రాంతం అతనికి బాగా తెలుసునని , దీనికి తోడు చలక్కుడి ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్‌లో( Chalakkudy Federal Bank Branch ) ఖాతా కూడా ఉందని పోలీసులు వెల్లడించారు.భోజన విరామం కావడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 ప్రాంతంలో బ్యాంక్‌లో ఎవరూ ఉండరని అతనికి తెలుసునని అదే సరైన సమయంగా ఎంచుకున్న రిజోకు దొంగతనం చేయడం సులభతరం అయ్యిందని చెప్పారు.

దొంగతనం చేసిన తర్వాత ఇరుకైన రోడ్లను ఎంచుకున్నాడని.మూడు సార్లు బట్టలు మార్చుకున్నాడని, అనుమానం రాకుండా ఉండటానికి తన స్కూటర్ వెనుక నకిలీ నెంబర్ ప్లేట్‌ను అతికించాడని, అయితే తాము తొలి రోజే నకిలీ రిజిస్ట్రేషన్‌ను గుర్తించామని పోలీసులు తెలిపారు.బూట్ల రంగు ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్‌లో అతనిని పట్టుకోవడానికి వీలు కుదిరిందని చెప్పాడు.
దొంగతనం జరగడానికి నాలుగు రోజుల ముందు రిజో.పోట్టా బ్యాంక్ వద్దకు వెళ్లి తన ఏటీఎం కార్డ్ గడువు ముగిసిందని చెప్పాడు.
ఈ సమయంలో బ్యాంక్ భద్రతా వ్యవస్ధను పరిశీలించి , దొంగతనం ఎలా చేయాలో ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.