యూదు సంతతికి చెందిన భారతీయ అమెరికన్ నిస్సిన్ రూబిన్( Nissin Rubin ) ప్రధాని నరేంద్రమోడీపై( PM Narendra Modi ) ప్రశంసల వర్షం కురిపించారు.యూదులతో( Jews ) భారతదేశ సంబంధాలను పెంపొందించడంలో ప్రధాని మోడీ చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మేరీలాండ్‌లో( Maryland ) అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ మైనారిటీస్ (ఏఐఏఎం) ప్రారంభోత్సవం సందర్భంగా రూబిన్ మాట్లాడుతూ.దాదాపు రెండు వేల సంవత్సరాలుగా యూదుల సంక్షేమం కోసం భారత్ కృషి చేస్తోందన్నారు
తాను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందినవాడినని .2000 ఏళ్లుగా యూదుల వ్యతిరేకత లేని ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం ( India ) మాత్రమేనని గర్వంగా చెబుతానని రూబిన్ అన్నారు.ఇజ్రాయెల్‌తో( Israel ) గడిచిన 30 ఏళ్లుగా భారత్ బంధం బలోపేతమైనా.
యూదులతో భారతదేశ సంబంధాలు అత్యంత పురాతనమైనవని ఆయన తెలిపారు.కోల్‌కతాలోని 120 ఏళ్ల చరిత్ర కలిగిన యూదు బాలిక పాఠశాలలో ముంబైలోని రెండు సాసూన్ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్ధులు ముస్లింలేనని సర్వమత సామరస్యానికి భారత్ ప్రాధాన్యత ఇస్తుందని రూబిన్ చెప్పారు.
![Telugu Indian American, India, India Israel, Indianjews, Israel, Jewishindian, J Telugu Indian American, India, India Israel, Indianjews, Israel, Jewishindian, J](https://telugustop.com/wp-content/uploads/2024/11/Jewish-Indian-American-Nissin-Rubin-praises-PM-Narendra-Modi-detailsd.jpg)
మిడిల్ ఈస్ట్‌లో ఇటీవలి కాలంలో తీవ్ర హింసాకాండ, ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నప్పటికీ.కోల్‌కతా, ముంబైలలోని యూదుల ప్రార్ధనా మందిరాలపై కానీ, ఈ పాఠశాలలపై కానీ ఒక్క రాయి కూడా పడలేదని ఆయన తెలిపారు.ఈ పాఠశాలలన్నీ ముస్లిం మెజారిటీ పరిసరాల్లోనే ఉన్నాయని.ఇది భారతీయుల మత సామరస్యాన్ని తెలుపుతున్నాయని రూబిన్ పేర్కొన్నారు.
![Telugu Indian American, India, India Israel, Indianjews, Israel, Jewishindian, J Telugu Indian American, India, India Israel, Indianjews, Israel, Jewishindian, J](https://telugustop.com/wp-content/uploads/2024/11/Jewish-Indian-American-Nissin-Rubin-praises-PM-Narendra-Modi-detailsa.jpg)
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ మైనారిటీస్ (ఏఐఏఎం)( Association of Indian American Minorities ) అనేది కొత్తగా స్థాపించబడిన ప్రభుత్వేతర సంస్థ.మేరీలాండ్‌లోని స్లిగో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి కేంద్రంగా ఇది కార్యకలాపాలు సాగించనుంది.భారతీయ అమెరికన్ డయాస్పోరాలోని మైనారిటీ కమ్యూనిటీల సంక్షేమాన్నీ ఏకీకృతం చేయడం , ప్రోత్సహించడమే ఈ సంస్థ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని మైనారిటీ అభ్యున్నతి కోసం కృషి చేసినందుకు గాను డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డుతో (గైర్హాజరు) సత్కరించారు.
వాషింగ్టన్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ, ఏఐఏఎం సంయుక్తంగా అందించిన ఈ అవార్డ్.సమ్మిళ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమానికి మోడీ చేసిన కృషిని గుర్తించింది.