నేటి కాలంలో చాలా మందికి అధిక బరువు సమస్య పెద్ద భారంగా మారింది.అధిక బరువు వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావడమే కాదు మనిషిని మానసికంగా కూడా కృంగదీసేస్తుంది.
అందుకే అధిక బరువు అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు.అయితే బరువు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అందులో ఒకటి ఆహారపు అలవాట్లు.వాస్తవానికి కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా బరువు పెరుగుతారు.
కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా తగ్గుతారు.
అయితే సపోటా పండు తీసుకోవడం వల్ల బరువు పెరగుతారా లేదా తగ్గుతారా అన్న ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు.ఎంతో రుచిగా ఉండే ఈ సపోటా పండ్లను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ అమితంగా ఇష్టపడుతుంటారు.సపోటా పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
ఈ పోషకాలు ఎన్నో జబ్బులను దూరం చేయడంలోనూ, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ ఉపయోగపడతాయి.
అయితే సపోటా పండ్లలో అనేక పోషకాలతో పాటు క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.కాబట్టి, సపోటా పండ్లను రెగ్యులర్‌గా లేదా అతిగా తీసుకుంటే శరీర బరువు పెరగడం కాయం అంటున్నారు నిపుణులు.ఎప్పుడో ఒకసారి ఈ సపోటా పండ్లను తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు.
కానీ, అధిక బరువు ఉన్న వారు, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు మాత్రం సపోటా పండ్లను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.
అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులు కూడా సపోటా పండ్లకు దూరంగా ఉండాలి.
ఎందుకంటే, చక్కెర మరియు పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి.ఇవి మధుమేహం రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచేస్తాయి.
ఫలితంగా, అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి, డయాబెటిస్ రోగులు కూడా సపోటా పండ్లను తినకపోవడమే మంచిది.