1.మనం కడుతోంది ఇళ్లు కాదు ఊళ్లు : జగన్
మనం కడుతున్నది ఇళ్ళు కాదని , ఊళ్లు అని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ అన్నారు.గుడివాడలో టిడ్కో ఇళ్ల ను ప్రారంభించిన సందర్భంగా జగన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
2.నేటి నుంచి కొత్త పాలన : కేటీఆర్
సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పనిలేదని, నేటి నుంచి కొత్త పాలన అందుబాటులోకి వస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.
3.పవన్ క్లారిటీ లేని వ్యక్తి : అంబటి
పవన్ కళ్యాణ్ ఏ విషయంలోనూ క్లారిటీ లేని వ్యక్తి అని , ఆయన అమాయకుడనో, మెంటల్ అనో తాను అనని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
4.హైదరాబాద్ కు రాష్ట్రపతి రాక
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
5.మూడో రోజు ఐటి రైట్స్
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల జనార్దన్ రెడ్డి ల ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు.
6.జనసేనకు అధికారం కట్టబెట్టండి : పవన్ కళ్యాణ్
జనసేనకు అధికారం కట్టబెట్టాలి అని, పరిపాలన నచ్చకపోతే తానే రాజీనామా చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
7.పవన్ పై మంత్రి బొత్స సెటైర్లు
డాన్సులు చేసుకుని వ్యక్తి మనకు సీఎంగా అవసరమా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
8.వారాహి యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు వారాహి వాహనం ద్వారా పిఠాపురం నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు.
9.దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ
దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ అవుతుందనే నమ్మకం ఉంది అని ,మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు.
10.రాజాసింగ్ విమర్శలు
వార్డ్ ఆఫీసుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం షో పుటప్ చేస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.
11.పవన్ కళ్యాణ్ పై రాంగోపాల్ వర్మ విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోఇజం నుంచి జీరో నిజానికి వచ్చారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శించారు.
12.ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చకు తాము సిద్ధం
ఏపీ ఆర్థిక పరిస్థితి పై జగన్మోహన్ రెడ్డి బహిరంగ చర్చికి వస్తే తాము చేద్దామని గతంలోని చెప్పామని ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
13. కొడాలి నాని విమర్శలు
టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు.నేను లేగిస్తే ఎవరూ పడుకోరని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారు.చంద్రబాబు మగాడయితే గుడివాడ నుంచి పోటీ చేయాలని నాని సవాల్ చేశారు.అసెంబ్లీ లో అడుగు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని నాని ఎద్దేవా చేశారు.
14.వైఎస్ వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ 30 వ తేదీకి వాయిదా పడింది.
15.కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణలో కేసీఆర్ కు నూకలు చెల్లాయి అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
16.సిపిఐ చలో గుడివాడ
ఎన్టీఆర్ జిల్లాలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు వెంటనే కేటాయించాలంటూ చలో గుడివాడ కు సిపిఐ పిలుపునిచ్చింది.
17.హరగోపాల్ పై కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నా : నారాయణ
ప్రొఫెసర్ హరగోపాల్ పై గ్రేస్ ద్రోహం కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, ఆయనపై కేసు పెట్టడాన్ని తాను ఖండిస్తున్నాను అని సిపిఐ జాతి కార్యదర్శి నారాయణ అన్నారు.
18.జూన్ 22 నుంచి బోనాల పండుగ
తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన క్లస్టర్ బోనాలు జాతర జూన్ 22 నుంచి ప్రారంభం కానుంది.
19.ఆర్టీసీ టీ -9 టికెట్
గ్రామీణ పట్టణ ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీ-9 టికెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 55,100
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 60,110
.