స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు( Nandamuri Balakrishna ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.వీరసింహారెడ్డి ( Veerasimha Reddy )సినిమాను సంక్రాంతి రేసులో నిలిపి హిట్ సాధించిన బాలయ్య 2025 సంక్రాంతికి బాబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మరికొన్ని రోజుల్లో ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ రిలీజ్ కానుంది.దీపావళి కానుకగానే ఈ టైటిల్ టీజర్ రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది.
అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US presidential election ) నందమూరి బాలకృష్ణ పోటీ చేశారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బాలయ్య ఏంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటి? అంటూ నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్( Trump ) అధ్యక్షునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉంది.

ఈ అదర్స్ అనే ఆప్షన్ లో బాలయ్య అభిమాని ఒకరు బాలయ్య పేరు రాసి బాలయ్యకు ఓటు వేశారు.ఈ విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ కూడా పోటీ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.బాలయ్య రెమ్యునరేషన్ కూడా 35 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

బాలయ్య బాబీ మూవీ బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య తర్వాత సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ2 టైటిల్ తో తెరకెక్కుతోంది.అఖండ2 మూవీ వచ్చే ఏడాదే థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.బాలయ్య ఇతర భాషల్లో సైతం మార్కెట్ పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్యకు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.







