స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )తన సినీ కెరీర్ లో ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు ప్రాణం పోస్తూ ఎన్నో విజయాలను అందుకున్నారు.బాలయ్య త్వరలో అఖండ సీక్వెల్ షూట్ లో పాల్గొననున్నారు.
బాలయ్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అఖండ ( akhanda )కాగా సీక్వెల్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలయ్య ఈ సినిమాలో శివ భక్తునిగా కనిపించనున్నారని సమాచారం.
నిజ జీవితంలో బాలయ్య ఆచారాలు, సాంప్రదాయాలకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అఖండ సీక్వెల్ లో ఆచారాల కొరకు పోరాడే రోల్ లో బాలయ్య కనిపించనున్నారని భోగట్టా.
సీక్వెల్ లో బాలయ్య పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని బాలయ్య నట విశ్వరూపం చూడబోతున్నామని కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవాలయాలు, వాటి పవిత్రత గురించి సినిమాలో డైలాగ్స్ ఉంటాయని సమాచారం.

బాలయ్య మార్క్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండేలా బోయపాటి శ్రీను ( Boyapati Srinu )జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం బోయపాటి శ్రీనుకు సైతం కీలకమే అనే సంగతి తెలిసిందే.బాలయ్య హిందూ గ్రంథాల్లో జోక్యం చేసుకుని వాటిని నాశనం చేయాలని ప్రయత్నించే కొందరు దుర్మార్గులను అంతం చేసే రోల్ లో కనిపించనున్నారు.

అఖండ సినిమాలో కనిపించిన చిన్న పాప పాత్రకు సంబంధించి కొనసాగింపు ఉంటుందని కూడా తెలుస్తోంది.బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.బాలయ్య నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లతో ఫ్యాన్స్ ను సైతం ఖుషీ చేస్తున్నారు.
బాలయ్య ఏడాదికి ఒక సినిమాలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.బాలయ్య సినిమాలు ఓవర్సీస్ లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి.







