ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా క్రేజ్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు.ఒకవేళ అలా అదృష్టం కలిసొచ్చి క్రేజ్ వస్తే దానిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఒక్క రాంగ్ స్టెప్ వేసిన ఎంతో వేగంగా వచ్చిన క్రేజ్ అంతే వేగంగా వెళ్ళి పోతూ ఉంటుంది.ఈ విషయం ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్ల విషయంలో నిజం అయింది.
ఇక ఆర్తి అగర్వాల్ కూడా ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది.కానీ ఆ తర్వాత వరుసగా రాంగ్ స్టెప్స్ వేయడంతో చివరికి అవకాశాలు లేక ఇండస్ట్రీలో కనుమరుగయ్యింది అన్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు కృతి శెట్టి సైతం ఇక ఇలాంటి బాటలోనే వెళ్తుంది అని తెలుస్తోంది.ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే నువ్వు నాకు నచ్చావ్ సినిమా కోసం అమెరికా నుంచి టాలీవుడ్ లో వాలిపోయింది ఆర్తి అగర్వాల్.ఇక మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో స్టార్ హీరోలా సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కాయ్.ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు కూడా ఖాతాలో వేసుకుంది ఆర్తి అగర్వాల్.
అయితే కొన్నాళ్ల సమయంలోనే కింద సీనియర్ హీరోల సరసన నటించడం మొదలుపెట్టింది.కలిసిరాని కథలను ఎంచుకుంది.ఇక మరోవైపు ఓ యువ హీరోతో ప్రేమలో కూడా పడింది.దీంతో కెరీర్ మొత్తం ఫ్లాప్ గానే మిగిలిపోయింది.
ఇప్పుడు కృతి శెట్టి కూడా ఇదే దారిలో వెళ్తుందా అంటే ఈ అమ్మడు సినిమాల ఎంపిక చూస్తే అవును అని అంటారు ఎవరైనా.ఉప్పెన సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది.ఈ సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేసింది.తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్
లాంటి వరుస హిట్లు పడటంతో ఈ అమ్మడికు బాగా కలిసొచ్చింది.తమిళ సినిమాల్లో కూడా ప్రస్తుతం అవకాశాలు దక్కించుకుంటుంది.కుర్ర హీరోలతో కాకుండా కాస్త వయసు మీద పడిన సీనియర్ హీరోలతో నటించడానికి సిద్ధమవుతోంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్, నితిన్ లతో కలిసి చేస్తున్న సినిమాలు కలిసొచ్చేలాగే ఉన్నా తమిళ సీనియర్ హీరో సూర్యతో సరసన నటించడం అందరికీ అవాక్కయ్యేలా చేస్తోంది.దీంతో సూర్య సినిమా ఒప్పుకుని కృతి శెట్టి రాంగ్ స్టెప్పులేసింది.
ఆర్తి అగర్వాల్ లాగానే కృతి కూడా ఓ యువ హీరోతో ప్రేమలో పడినట్లు టాక్ వినిపిస్తోంది.చివరికి కృతి శెట్టి కెరియర్ ఏమైపోతుందో చూడాలి.