ప్రస్తుత రోజులలో సోషల్ మీడియాలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇలా జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చాలామందిని ఆకట్టుకుంటే మరి కొన్ని మాత్రం చాలా బాధాకరంగా కనబడతాయి.
కొందరు అసభ్యకరమైన వీడియోలను, ఫోటోలను ( Videos, photos )షేర్ చేస్తుంటే.మరికొందరు జంతువులను హింసిస్తూ వాటిని వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు.
ఇలా వారు రాక్షసానందం పొందుతున్న వెధవలను ఎన్ని తిట్టినా, కొట్టిన తమ బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు.అచ్చం అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియోకు సంబంధించిన వివరాలను చూస్తే.

ఒక ప్రదేశంలో ఆవును( Cow ) కట్టేసి ఉంచారు.అయితే అక్కడికి వచ్చిన ఆవు పక్కనే ఉన్న నాగుపాము మూడుసార్లు ఆవును కాటేయడం మనం వీడియోలో చూడవచ్చు.పాపం ఆ ఆవు బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే సదరు వ్యక్తి దాన్ని రక్షించడం మానేసి వీడియో తీస్తున్నాడు.
ఇలా మానవత్వం లేకుండా ప్రవర్తించిన సదరు వ్యక్తిపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా వీడియో తీయడమే కాకుండా పైగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిని ఊరికే విడిచి పెట్టకుండా మూగజీవాలను హింసించే వారిపై కేసు పెట్టాలని డిమాండ్లు కూడా తలెత్తుతున్నాయి.చాలామంది ఈ పోస్టుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.
వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా కానీ.
ప్రస్తుత సమాజంలో మానవత్వానికి చోటు లేకుండా అయిపోయిందనే చెప్పాలి.







