దసరా మూవీని మిస్ చేసుకున్న హీరో.. అసలు విషయం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్!

మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) హీరోగా నటించిన తాజా చిత్రం మట్కా.( Matka ) కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి అలాగే బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించారు.ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.అంతేకాకుండా ఇప్పుడు ఈ సినిమా ట్రెడింగ్ అవుతోంది.ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

 Music Director Gv Prakash Kumar Comments On Varun Tej Matka And Missing Role In-TeluguStop.com

ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Dasara, Karun Kumar, Gvprakash Kumar, Matka, Role, Music, Nani, Tollywood

ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అందులో భాగంగానే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్( GV Prakash Kumar ) విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకుని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.ఈ క్రమంలోనే దసరా మూవీ( Dasara Movie ) గురించి కూడా స్పందించారు జీవి ప్రకాష్.

మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్‌కి ఇస్తారా? అని ప్రశ్నించగా.నా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్‌కి ఉంటుంది.

తర్వాత డైరెక్టర్ గురించి కూడా ఆలోచిస్తాను.తను ఇంతకుముందు ఎలాంటి సినిమాలు చేశారు? తన ఫిల్ మేకింగ్ స్టైల్ ఏమిటి, విజువల్‌గా కథని ఎలా తీస్తారనేది కూడా చూస్తాను అని తెలిపారు.

Telugu Dasara, Karun Kumar, Gvprakash Kumar, Matka, Role, Music, Nani, Tollywood

అనంతరం డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.కరుణ్ కుమార్ గారు చాలా అద్భుతమైన రైటర్.డార్క్ జోనర్ సినిమా చేయడంలో ఆయనదిట్ట.ఆయన సినిమాల్లో రా నెస్ ఉంటుంది.ఆయన కథలు నేచురల్‌గా ఉంటాయి.ఈ సినిమాలో కరుణ్ కుమార్ గారితో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అని తెలిపారు.

యాక్టర్‌గా తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తున్నారు? అని ప్రశ్నించగా.నిజానికి నాని దసరా సినిమాలో ఒక క్యారెక్టర్ నేను చేయాల్సింది.

కానీ నా డేట్స్ కుదరలేదు.మంచి కథ, క్యారెక్టర్ ఉంటే డెఫినెట్‌ గా చేస్తాను అని తెలిపారు జీవి ప్రకాష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube