డైట్ అక్కర్లేదు.. దీన్ని తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా?

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్యతో కోట్లాది మంది సతమతం అవుతున్నారు.అధిక బరువు వల్ల శరీర ఆకృతి దెబ్బతింటుంది.

 Best Smoothie For Losing Weight Without Diet! Smoothie, Weight Loss, Weight Loss-TeluguStop.com

అధిక బ‌రువు అనేక అనర్థాలను తెచ్చిపెడుతుంది.ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ముప్పతిప్పలు పడుతుంటారు.

ముఖ్యంగా చాలా మంది కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే స్మూతీని తీసుకుంటే డైట్ అక్కర్లేదు.

ఎందుకంటే ఈ స్మూతీ తో ఈజీగా బరువు తగ్గవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia Seeds ) వేసి వాటర్ పోసి నాన‌బెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు కర్బూజ పండు ముక్కలు, అర కప్పు అరటిపండు ముక్కలు మరియు ఒక కప్పు ఆరెంజ్ వేసుకోవాలి.

అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్యాట్ లెస్ పెరుగు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) మరియు నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేస్తే మన స్మూతీ సిద్ధం అవుతుంది.ఇది టేస్ట్ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా బరువు తగ్గడానికి చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

రోజు ఈ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.

చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.దీంతో క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.

ఫలితంగా సూపర్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు.

కాబట్టి ఎవరైతే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.పైగా ఈ స్మూతీ ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.

బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.మరియు రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా సైతం ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube