ఆకుకూరలు అనగానే మనందరికీ తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చలి కూర ఇవే ఎక్కువగా గుర్తుకు వస్తాయి.కానీ ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తే ఆకుకూరల్లో చుక్కకూర( Spinach Dock ) కూడా ఒకటి.
చూడడానికి బచ్చలి కూర మాదిరిగానే ఉన్నా.పులుపు రుచి కలిగి ఉంటుంది.
అందుకే చుక్కకూరను పుల్ల బచ్చలి అని పిలుస్తారు.ఇంగ్లీష్ లో స్పినాచ్ డాక్, ఇండియన్ సోరెల్, బ్లాడర్ డాక్ లేదా రోజీ డాక్ అని అంటారు.
చుక్కకూరలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్ ఎ మరియు సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.కేలరీలు, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి.
అందుకే చుక్కకూర ఆరోగ్యానికి వరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.వారానికి ఒక్కసారి తిన్న బోలెడు లాభాలు పొందుతారని సూచిస్తున్నారు.ముఖ్యంగా చుక్కకూరకు క్యాన్సర్ రిస్క్ ను( Cancer Risks ) తగ్గించే సత్తా ఉంది.చుక్కకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ము, కడుపు, ప్రోస్టేట్ క్యాన్సర్‌లతో సహా కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించగలదు.
అలాగే చుక్కకూరలో ఉండే విటమిన్స్ శరీరానికి అంటువ్యాధులు మరియు అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడే రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

మలబద్ధకంతో( Constipation ) బాధపడుతున్న వారికి చుక్కకూర మంచి ఆహార ఎంపిక అవుతుంది.చుక్కకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇది మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
మలబద్ధకానికి చెక్ పెడుతుంది.అలాగే చుక్కకూరలో ఉండే కాల్షియం ఎముకలు మరియు దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

చుక్కకూరలో మెగ్నీషియం మరియు విటమిన్ బి6 ఉంటాయి.ఇవి ఒత్తిడి, ఆందోళన నుంచి రిలీఫ్ ను అందిస్తాయి.మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.అంతేకాదండోయ్ జియాక్సంతిన్ మరియు లుటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు చుక్కకూర గొప్ప మూలం.వారానికి ఒకసారి చుక్కకూరను తీసుకుంటే కంటి చూపు పెరుగుతుంది.దృష్టి లోపాలు దరి చేరకుండా ఉంటాయి.