సాధారణంగా ఒక్కోసారి ముఖ చర్మం నల్లగా( Dark Skin ) మారిపోతూ ఉంటుంది.చర్మం లో మెలనిన్( Melanin ) పెరగడం వల్లే నలుపుదనం ఏర్పడుతుంది.
వేడి వేడి నీటితో స్నానం చేయడం, ఎండల్లో ఎక్కువగా తిరగడం, రసాయనాలు అధికంగా ఉండే సోప్స్ వినియోగించడం, హార్మోన్ చేంజ్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర అంశాలు స్కిన్ కలర్ ను ప్రభావితం చేస్తాయి.అయితే చర్మం నలుపును తగ్గించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ముఖ్యంగా డైట్ లో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, సీడ్స్, చేపలు వంటి పోషకాహారాన్ని చేర్చుకోవాలి.పాలు, పాల పదార్థాలు, జంక్ ఫుడ్, చాక్లెట్స్, స్పైసీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.
రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలి.అలాగే చర్మం నలుపును తగ్గించడానికి ఓట్స్ అండ్ ఎగ్ మాస్క్ అద్భుతంగా తోడ్పడుతుంది.
అందుకోసం ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్,( Oats Powder ) ఒక ఎగ్ వైట్( Egg white ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు మూడు సార్లు ఈ మాస్క్ ను వేసుకుంటే స్కిన్ సూపర్ వైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.
అలాగే స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేయడానికి మరొక చిట్కా ఉంది.దానికోసం ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ బాదం పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించిన కూడా చర్మం నలుపుదనం పోతుంది.
స్కిన్ వైట్ గా గ్లోయింగ్ గా మారుతుంది.