“సిగరెట్స్ ఇంజురీస్ టు హెల్త్” అని సిగరెట్ పెట్టపై ముద్రించి అమ్ముతున్న గాని ప్రపంచంలో చాలామంది వాటిని తాగడం మాత్రం మానడం లేదు.ఇకపోతే చెత్త నుండి సంపద సృష్టించడం గురించి మనం చాలా విషయాలే చూసాం.
ముఖ్యంగా చెత్త పదార్థాల వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయగల ప్లాంటులను మనం చూసాం.అలాగే అదే చెత్తతో( Wastage ) ఎరువులను తయారు చేస్తూ డబ్బు సంపాదించే వారిని కూడా చూసాము.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.తాజాగా పనికిరాని సిగరెట్ పీకులకు( Cigarette Butts ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎందుకు పనికిరాని సిగరెట్ పీకలను కొందరు ఎలా ఉపయోగించుకుంటున్నారు చూసి ఆశ్చర్యపోతున్నారు.ఇంతకీ వైరల్ ఆయన వీడియోలో( Viral Video ) ఏముందన్న విషయానికి వెళ్తే.
ఓ వ్యక్తి వాడేసిన సిగరెట్ పీకలను చూడగానే ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది.వాటిని ఉపయోగించి ఎందుకు డబ్బులు సంపాదించకూడదన్న ఆలోచన అతనిలో మెదిలింది.దాంతో వెంటనే ఆ ఆలోచనలోకి తీసుకువచ్చి రోడ్లపై పడేసిన సిగరెట్ పీకలను సేకరించడం మొదలు పెట్టాడు.ఇలా అతడు సిగరెట్ పీకలన్నిటిని ఓ గుట్టగా పోసి ఆ తర్వాత సిగరెట్ చివరిలో ఉన్న దూదిని( Cotton ) బయటకి తీయడం మొదలుపెట్టాడు.
అలా ఆ దూదిని మొత్తం నీటిలో ముంచి శుభ్రం చేసిన తర్వాత దాన్ని ఓ మిషన్ లో వేసి దూదిని రిసైకిల్ చేస్తున్నాడు.అలా రీసైకిల్ చేసిన తెల్లగా మెరిసే దూదిని పిల్లలు ఆడుకునే టెడ్డి బేర్లలో( Teddy Bears ) వేసి ప్యాక్ చేస్తున్నారు.
ఇలా ఎందుకు పనికిరాని సిగరెట్ పీకలకు ఉపయోగించి అందమైన టెడ్డీబేర్లలో ఉపయోగించే దూదిని తయారు చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ ఆ వ్యక్తిని తెగ మెచ్చుకుంటున్నారు.అయితే, కొందరు మాత్రం ఈ విషయాన్ని కాస్త నెగిటివ్ గా కూడా ఆలోచిస్తున్నారు.కొందరేమో.
నీ ఐడియా సూపర్ బాసు అని అంటుంటే.మరికొందరేమో సిగరెట్ పీకలలో టాక్సిన్స్ ఉంటాయి.
అవి పిల్లలకు ప్రమాదంగా మారుతాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా అతడికి వచ్చిన ఆలోచన చాలా సూపర్ అంటూ.
కామెంట్ చేసిన వారు ఎక్కువగా ఉన్నారు.